Headlines

బూందీ గరిటె లేకుండానే రుచికరమైన జ్యూసీ బూందీ లడ్డును ఇలా ఈజీగా చేసేయండి


కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు శనగపిండి, నీళ్ళు 1¼ కప్పులు , కొంచం వంటసోడా, రెండు కప్పులు పంచదార, నీళ్ళు (పాకానికి)
పచ్చ కర్పూరం చిటికెడు కంటే తక్కువ, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, నూనె, పసుపు రంగు ఫుడ్ కలర్ ను తీసుకోవాలి. ముందుగా, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జల్లెడ పెట్టి రెండు కప్పుల శనగపిండిని జల్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండిలో ఉండలు లేకుండా ఉంటుంది. జల్లించుకున్న పిండిలో చిటికెడు కంటే తక్కువ వంటసోడా వేసి బాగా కలపాలి. వంటసోడా వేయడం వల్ల బూందీ చక్కగా పొంగి లడ్డు సాఫ్ట్ గా, జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా దోసపిండి కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరీ జారుగా గాని, మరీ గట్టిగా గాని ఉండకూడదు. గరిటెలో వేసి కిందకు వదిలినప్పుడు సులువుగా జారే విధంగా ఉండాలి. పిండి బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *