Headlines

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అగ్గిపెట్టి మచ్చ మృతి.. అనారోగ్యంతో


ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ ‘అగ్గిపెట్టి మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

యూట్యూబ్ వేదికగా తనదైన కామెడీ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్ కుమార్ ‘అగ్గిపెట్టి మచ్చ’ పేరుతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చేసిన కామెడీ వీడియోలు, వినోదాత్మక కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.

కిరణ్ కుమార్ మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల్లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు యూట్యూబర్లు, కళాకారులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *