ఉసిరిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. తరచుగా ఎదురయ్యే అనారోగ్య సమస్యల నుండి రక్షణ కల్పించడంలో ఉసిరి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయలు విటమిన్ సి కి ప్రసిద్ధి. నారింజ, దానిమ్మకాయల కంటే కూడా ఎక్కువ విటమిన్ సి ఉసిరిలో లభిస్తుంది. ఈ విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచి దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.