Headlines

చిన్న పిల్లలు లొట్టలేసుకొని తింటారు.. టేస్టీ లడ్డు ఇదే


తయారీలోకి వెళ్లితే.. ముందుగా ఒక మందపాటి పాన్‌ను స్టవ్‌పై పెట్టి, అందులో 1/4 కిలో బెల్లాన్ని వేయండి. బెల్లాన్ని తురిమి కానీ, చిన్న ముక్కలుగా చేసి కానీ వేస్తే త్వరగా కరుగుతుంది. ఇందులో సుమారు ఒక కప్పు నీళ్లను చేర్చండి. నీళ్లు బెల్లం పూర్తిగా తడిచేలా చూసుకోవాలి. స్టవ్‌ను సిమ్‌లో ఉంచి, బెల్లం పూర్తిగా కరిగేంతవరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్‌లో పెడితే బెల్లం అడుగు అంటుకుని మాడిపోయే అవకాశం ఉంది. బెల్లం పూర్తిగా కరిగి, తీగ పాకం వచ్చిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ బెల్లం నీరును వడపోసి తీసుకోవాలి.. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే దుమ్ము, రాళ్లు, ఇతర నలకలు తొలగిపోయి, శుభ్రమైన పాకం లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *