చర్మ సంరక్షణ కోసం ఖరీదైన సీరమ్‌లపై డబ్బు ఖర్చు చేసే ముందు, మన వంటింట్లోనే లభించే బియ్యం నీటిని ప్రయత్నించవచ్చు. కొరియన్ గ్లాస్ స్కిన్ తరహా మెరుపు కోసం స్కిన్‌కేర్ రొటీన్‌లో రైస్ వాటర్ చేర్చుకోవడం మంచిదని ఆయుర్వేద హెల్త్ కోచ్ డింపుల్ జాంగ్రా చెబుతున్నారు.
చర్మానికి కలిగే ముఖ్య లాభాలు
స్కిన్ బారియర్ బలోపేతం: రైస్ వాటర్ వాడటం వల్ల చర్మ రక్షణ పొర దృఢంగా మారుతుంది. ఇందులోని అమైనో ఆమ్లాలు తేమను కాపాడతాయి, స్టార్చ్ పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
సహజ మెరుపు, యాంటీ-ఏజింగ్: సహజంగా చర్మానికి కాంతిని ఇవ్వడానికి ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఇనోసిటాల్ వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడానికి తోడ్పడుతుంది.
ఇవి కూడా చదవండి
ఎగ్జిమాలో ఉపశమనం: ఎగ్జిమా సమస్య ఉన్నవారికి కూడా బియ్యం నీరు ప్రయోజనకరంగా ఉంటుందని, క్రమం తప్పకుండా వాడితే చర్మం వాపు సుమారు 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తయారీ, వాడే విధానం
ఒక కప్పు బియ్యాన్ని మూడుసార్లు కడగాలి. తర్వాత అందులో శుభ్రమైన నీరు పోసి మూత పెట్టి 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. నీరు కొద్దిగా మసకబారిన తర్వాత వడకట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. దీనిని రెండు నుంచి మూడు రోజుల వరకు ఫేస్ స్ప్రే మాదిరిగా ముఖంపై చల్లుకుని ఉపయోగించుకోవచ్చు.
చర్మ సంరక్షణకు సహజమైన, సులభమైన మార్గాలను ఎంచుకునే వారికి రైస్ వాటర్ ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. అయితే కొత్త ఉత్పత్తులు లేదా ఇంటి చిట్కాలు వాడే ముందు మీ చర్మ తత్వానికి సరిపోతుందో లేదో గమనించడం ఎప్పుడూ మంచిది.