Headlines

Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్


Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్

ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్ల ఉపసంహరణతో పాటు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను హోల్డ్ చేసింది. దీంతో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అభ్యర్థుల తుది జాబితా ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల నుంచి వినతులు, ఆధారాలను ఎన్నికల సంఘం పరిశీలించనుంది. అధికారుల నివేదిక తర్వాత రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. నామినేషన్ల గడువు పొడిగిస్తే అభ్యర్థులకు కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించేలా ఎస్ఈసీ చర్యలు తీసుకోనుంది. నామినేషన్లు వేయలేకపోయినా అభ్యర్థుల అంశంపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికలు వచ్చాక నామినేషన్ల గడువు పొడిగించడంపైవ గురువారం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. అయితే తదుపరి ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు  ఎన్నికల ప్రధానాధికారి అనిల్‌చంద్ర పునేఠా అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *