Headlines

టీ20ల్లో అభిషే’కింగ్’.. రసెల్ రికార్డు బ్రేక్.. సరికొత్త హిస్టరీలో కాటేరమ్మ కొడుకు!


అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 పోరులో సంజు శాంసన్ వికెట్ ఆరంభంలోనే పడిపోయినప్పటికీ, అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా ఎదురుదాడి చేశాడు. కేవలం 22 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, బంతుల పరంగా టీ20 క్రికెట్ చరిత్రలో రెండో వేగవంతమైన 6000 పరుగుల ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 3420 బంతుల్లోనే ఆరు వేల పరుగుల మార్కును అధిగమించి ఆండ్రీ రసెల్ (Andre Russell), టిమ్ డేవిడ్ (Tim David), ఫిల్ సాల్ట్ (Phil Salt) వంటి పవర్ హిట్టర్ల రికార్డులను తిరగరాశాడు. భారత క్రికెట్ జట్టు (Team India) తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు వివిధ టీ20 లీగ్‌లలో అతడు చూపించిన నిలకడైన దూకుడుతో ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.

ప్రపంచవ్యాప్తంగా టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో 6000 పరుగులు సాధించిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ హిట్టర్ ఫిన్ అలెన్ (Finn Allen) 3386 బంతులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాన్ని 3420 బంతులతో అభిషేక్ శర్మ కైవసం చేసుకోగా, రసెల్ 3550 బంతులతో మూడో స్థానంలో, టిమ్ డేవిడ్ 3681 బంతులతో నాలుగో స్థానంలో ఉన్నారు.

ఈ మైలురాయిని చేరుకోవడానికి అభిషేక్ 203 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. మొత్తం కెరీర్‌లో 32కు పైగా సగటు, 175కు పైగా స్ట్రైక్ రేట్‌తో రాణించాడు. ఇందులో 9 సెంచరీలు కూడా ఉన్నాయి. భారత బ్యాటర్లలో టీ20ల్లో ఇది రెండో అత్యధిక శతకాల రికార్డు. ఇక భారత్ తరఫున ఆడిన 57 అంతర్జాతీయ టీ20లలో 189.68 స్ట్రైక్ రేట్‌తో 1711 పరుగులు సాధించాడు. వీటిలో 2 సెంచరీలు, 12 అర్ధశతకాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి



అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో 14 సార్లతో అభిషేక్ ఐదో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) 39, రోహిత్ శర్మ (Rohit Sharma) 37, సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) 29, కేఎల్ రాహుల్ (KL Rahul) 24 సార్లు ఈ ఘనత సాధించారు. అభిషేక్ చేసిన 14 అర్ధశతకాల్లో 12 సార్లు 25 కంటే తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీలు నమోదు చేసి రికార్డు నెలకొల్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *