పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుంది.. దీన్ని ఏమంటారో తెలుసా?

పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుంది.. దీన్ని ఏమంటారో తెలుసా?


మన చుట్టు పక్కల ఏ చిన్న గొడవ జరిగిన, ప్రమాదం జరిగినా వెంటనే గుర్తొచ్చేది పోలీసు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా క్షణాల్లో వచ్చి సాల్వ్ చేయడంలో వాళ్లెప్పుడూ ముందే ఉంటారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలోనూ పోలీసులు కీలక పాత్ర పోషిస్తారు. అయితే మీరు చాలా సార్లు పోలీసులు ధరించే యూనిఫామ్ చూసే ఉంటారు. అయితే వారి యూనిఫాంపై ఉండే కొన్ని ప్రత్యేక గుర్తులను మాత్రం చాలా తక్కువ మంది గమనిస్తారు. మీరు గమనించినట్లయితే పోలీసు యూనిఫాం భుజం నుండి జేబు వరకు ఒక తాడు వేలాడుతూ ఉండటం మీరు చూసే ఉంటారు. అసలు ఈ తానుడు ఏమంటారు. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో అనేది చాలా మందికి తెలియదు.

ఆ తాడును ఏమంటారు?

అయితే పోలీసు యూనిఫాం భుజంపై ఉండే ఈ తాడును ‘ల్యాన్యార్డ్’ అని పిలుస్తారు. మీరు దాన్ని క్షుణ్నంగా గమనిస్తే, ఆ తాడు ఒక చివర భుజానికి, మరో చివర పోలీసుల జేబు లోపలికి వెళ్లినట్లు కనిపిస్తుంది. అయితే ఆ తాడు చివర ఒక విజిల్ కట్టబడి ఉంటుంది. దానిని వారు ఎప్పుడూ జేబులో పెట్టుకుని ఉంటారు. దాన్ని వారు ట్రాఫిక్‌ను నియంత్రించేటప్పుడు వాహనదారులను హెచ్చరించడానికి, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా నేరస్థులను వెంబడించేటప్పుడు సహచర పోలీసులకు సిగ్నల్ ఇవ్వడానికి లేదా ప్రజలను హెచ్చరించడానికి ఉపయోగిస్తారు. పరుగెత్తేటప్పుడు లేదా విధి నిర్వహణలో ఉన్నప్పుడు విజిల్ ఎక్కడో పడిపోకుండా దానిని ఈ తాడుతో కట్టి ఉంచుతారు.

ఇవి కేవలం పోలీసులకే కాకుండా, భారత సైన్యం, పారామిలిటరీ దళాలతో సహా భద్రతా సిబ్బంది అందరి యూనిఫామ్‌లపై ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఈ ల్యాన్యార్డ్‌లు ఒక్కో అధికారి యూనిఫాం కు ఒక్కో రంగులో ఉంటాయి. సాధారణంగా DSP, SSP లేదా అంతకంటే పైస్థాయి అధికారుల యూనిఫామ్‌కు నలుపు రంగు ల్యాన్యార్డ్‌ ఉంటే.. వారి కంటే తక్కువ స్థాయి సిబ్బంది ఖాకీ రంగు ల్యాన్యార్డ్ ఉంటుంది. అయితే ఈ రంగులు రాష్ట్రాల నిబంధనలను బట్టి మారుతూ ఉంటాయి. అదే ఆర్మిలో అయితే వారు ఉండే రెజిమెంట్‌ను బట్టి ఈ ల్యాన్యార్డ్ రంగులు మారుతుంటాయి.

అసలు ఈ తాడుకు ల్యాన్యార్డ్ అని ఎందుకు పిలుస్తారంటే.. ఇది లానియర్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఉద్బవించింది. 15వ శతాబ్దంలో ఫ్రెంచ్ సైనికులు, నౌకాదళ సిబ్బంది యుద్ధ సమయంలో ఆయుధాలను భద్రంగా ఉంచుకోవడానికి ఇలాంటి తాళ్లనే ఉపయోగించేవారట.అందుకే సమాజంతో శాంతిభద్రతలను కాపాడే పోలీసులు, ఆర్మీ అధికారుల యూనీఫామ్‌లకు ఈ ల్యాన్యార్డ్‌లను ఉంచుతార.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *