Central Govt Jobs 2026: పదో తరగతి అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే?

Central Govt Jobs 2026: పదో తరగతి అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే?


కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అయినా కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్‌ అండ్‌ ఓవర్సీర్‌, హెచ్‌ఈఎంఎం ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 577 హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ (ట్రైనీ), పారామెడికల్ స్టాఫ్, ఓవర్సీర్ (సివిల్) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగత అర్హత గల అభ్యర్థులు మే 1, 2026వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పోస్టుల వివరాలు ఇలా

  • హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ ట్రైనీ (డంపర్, డోజర్, గ్రేడర్ క్రేన్‌, పేలోడర్‌, సర్ఫేస్‌ మైనర్‌ విభాగాల్లో) పోస్టుల సంఖ్య: 472
  • పారామెడికల్ స్టాఫ్ (స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్ట్‌) పోస్టుల సంఖ్య: 75
  • ఓవర్సీర్ సివిల్ పోస్టుల సంఖ్య: 30

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్‌కు 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇక పారామెడికల్‌కు పోస్టులకు ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి లేదా నర్సింగ్, ఫార్మసీ, పాథాలజీ తదితర విభాగాల్లో డిగ్రీ కలిగి ఉండాలి. ఓవర్సీర్‌కు సివిల్ ఇంజినీరింగ్‌ పోస్టులకు 3 ఏళ్ల డిప్లొమా తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో ము 1, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1180 చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ (ట్రైనీ) పోస్టులకు రోజుకు రూ.1,502, పారామెడికల్, ఓవర్సీర్ (గ్రేడ్ C) పోస్టులకు నెలకు రూ.47,330, ఇతర టెక్నీషియన్లు (గ్రేడ్ D) పోస్టులకు నెలకు రూ.43,775 చొప్పున జీతంగా చెల్లిస్తారు. జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *