Headlines

పోలీస్ శాఖలో 275 SI ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేయలేదా..? మరో 2 రోజుల్లో ముగుస్తున్న గడువు!


తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) గత నెలలో విడుదల చేసిన పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేసుకోవలేదా..? మరో మూడు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు సెప్టెంబర్ 16, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 275 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్‌ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

పోస్టుల వివరాలు..

తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో..

SCT సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పోస్టుల సంఖ్య: 148
SCT రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (AR) పోస్టుల సంఖ్య: 14
SCT రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SAR CPL పురుషులు) పోస్టుల సంఖ్య: 3
SCT రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (TGSP పురుషులు) పోస్టుల సంఖ్య: 12

తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో..

SCT సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల సంఖ్య: 44

ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్‌లో..

స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 39

తెలంగాణ జైళ్లు & కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌లో..

  • డిప్యూటీ జైలర్ (పురుషులు) పోస్టుల సంఖ్య: 14
  • డిప్యూటీ జైలర్ (మహిళలు) పోస్టుల సంఖ్య: 1

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఓపెన్ యూనివర్సిటీ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పొందిన డిగ్రీలు యూజీసీ, ఏఐసీటీఈ లేదా సంబంధిత గుర్తింపు సంస్థలచే గుర్తింపు పొందినవై ఉండాలి. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు చెల్లుబాటు అయ్యే LMV డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అభ్యర్ధుల వయోపరిమితి జులై1, 2026 నాటికి 21 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది. మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ముగింపు గడువులోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరత్‌ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించాలి. అభ్యర్థులు TSLPRB అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు రుసుము చెల్లించి ఆన్‌లైన్ అప్లికేషన్‌ను పూర్తి చేసి సమర్పించాలి. అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. ముందుగా ప్రిలిమినరీ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్) నిర్వహిస్తారు. అనంతరం ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫైనల్ రాత పరీక్షలోని నాలుగు పేపర్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు. చివరగా తుది మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతభత్యాలు ఈ కింది విధంగా ఉంటాయి..

  • ఎస్సై (సివిల్), ఆర్‌ఎస్సై, ఎస్‌పీఎఫ్ ఎస్సై పోస్టులకు నెలకు: రూ.42,300 నుంచి రూ.1,15,270 వరకు
  • స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు నెలకు: రూ.38,890 నుంచి రూ.1,12,510 వరకు

తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్సై పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *