Mohammed Siraj Captain: భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను 2026-27 రంజీ ట్రోఫీ సీజన్‌కు హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నియమించింది. చామా మిలింద్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌ను త్రిపురతో తలపడనుంది.
హైదరాబాద్ జట్టు ఎలైట్ గ్రూప్ బిలో ఉంది. ఈ గ్రూప్‌లో సౌరాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, త్రిపుర వంటి బలమైన జట్లు ఉన్నాయి. ఇటీవల శ్రీలంక పర్యటనలో సిరాజ్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేసే అతను, అక్కడ 120 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్ చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో 44 ఓవర్లు వేసి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.
ఎక్కువమంది చదివినది: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సిందే.. అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్..!
రెండు నెలల విరామం తర్వాత నేరుగా మ్యాచ్ ఆడటంతో తన బౌలింగ్ లయ దెబ్బతిన్నట్లు సిరాజ్ తెలిపాడు. రన్ అప్‌లో అడుగులు సరిగ్గా పడకపోవడంతో వేగం తగ్గిందని వివరించాడు. అయితే, దులీప్ ట్రోఫీ ఫైనల్లో తిరిగి లయ అందుకున్న సిరాజ్, దేశం తరఫున ఆడేటప్పుడు సాకులు చెప్పకూడదని స్పష్టం చేశాడు.
ఎక్కువమంది చదివినది: ఆసియా విజేతగా నిలిచినా.. ట్రోఫీతోపాటు ఒక్కపైసా దక్కదు.. ఎందుకో తెలుసా?
జట్టు కోసం పూర్తి స్థాయిలో కష్టపడటమే తనకు ముఖ్యమని చెప్పాడు. ఇప్పుడు హైదరాబాద్ కెప్టెన్‌గా సిరాజ్ ముందు మరో సవాల్ ఉంది. నాయకత్వంతో పాటు బంతితోను సత్తా చాటేందుకు ఈ రంజీ సీజన్ అతనికి మంచి అవకాశాన్ని అందించనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..