అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారా? అద్భుతమైన ఇంటీరియర్ లుక్‌ కోసం ఇలా చేయండి

అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారా? అద్భుతమైన ఇంటీరియర్ లుక్‌ కోసం ఇలా చేయండి


అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి గార్డెనింగ్ ఒక సవాలుగా అనిపించవచ్చు. అలాంటి వారి కోసం తక్కువ స్థలం, తక్కువ నీటితో పెరిగే సక్యూలెంట్ మొక్కలు ఒక వరం. అద్భుతమైన ఆకారాలు, రంగులతో ఇవి మీ ఇళ్లను కళాత్మకంగా మారుస్తాయి. అందమైన అలోవెరా నుంచి ఆకర్షణీయమైన జెబ్రా హవార్తియా వరకు మీ ఇంటిని అందంగా మార్చే ఆ ఏడు మొక్కలు, వాటి ప్రత్యేకతలేమిటో చూద్దాం.

ఆధునిక జీవనశైలిలో మన ఇళ్లను అందంగా, ప్రశాంతంగా ఉంచుకోవడానికి మొక్కలు చాలా ముఖ్యం. అయితే, పెద్ద గార్డెన్లు పెంచే అవకాశం లేని వారికి స్కూలెంట్స్ (Succulents) ఉత్తమ ఎంపిక. ఇవి చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, చాలా తక్కువ నీటితో, తక్కువ స్థలంలో పెరుగుతాయి. మీ షెల్ఫ్‌లు, కాఫీ టేబుల్స్, బాల్కనీలు లేదా వర్క్‌స్పేస్‌లో వీటిని ఉంచడం ద్వారా ఇంటీరియర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.

ఆకట్టుకునే 7 అద్భుతమైన స్కూలెంట్స్

  • ఎచెవేరియా (Echeveria): ఇది చూడటానికి వికసించిన పువ్వులా ఉంటుంది. పచ్చ, పింక్, పర్పుల్ రంగుల్లో దొరికే ఈ మొక్క విండో సిల్స్‌కు ఎంతో అందాన్ని ఇస్తుంది.
  • జేడ్ ప్లాంట్ (Jade Plant): దీని మెరిసే ఆకులు చాలా క్లీన్ లుక్‌ను ఇస్తాయి. దీన్ని అదృష్టానికి చిహ్నంగా కూడా భావిస్తారు, కాబట్టి ఆఫీసుల్లోనూ ఎక్కువగా పెట్టుకుంటారు.
  • జెబ్రా హవార్తియా (Zebra Haworthia): దీని ఆకులపై ఉండే తెల్లని చారలు జెబ్రాను గుర్తుకు తెస్తాయి. తక్కువ వెలుతురులో కూడా ఇది బాగా పెరుగుతుంది.
  • బరోస్ టైల్ (Burro’s Tail): వేలాడే కుండీలలో ఇది అద్భుతంగా కనిపిస్తుంది. దీని ఆకులు తీగల్లా కిందకు వేలాడుతూ చూడటానికి చాలా ఎలిగెంట్‌గా ఉంటాయి.
  • అలోవెరా (Aloe Vera): ఇది కేవలం ఔషధ గుణాలున్న మొక్కే కాదు, ఇంటీరియర్‌కు ఒక ఆధునిక రూపాన్ని కూడా ఇస్తుంది. ఎండ తగిలే బాల్కనీల్లో ఇది బాగా పెరుగుతుంది.
  • స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ (String of Pearls): పూసల వంటి ఆకులు కలిగిన ఈ మొక్క, ఖాళీ మూలలను అందమైన ఫోకల్ పాయింట్లుగా మార్చేస్తుంది.
  • పాండా ప్లాంట్ (Panda Plant): మెత్తని ఆకులు, వాటి అంచున బ్రౌన్ రంగు కలిగి ఉండి చాలా క్యూట్‌గా ఉంటుంది. డెస్క్‌లపై ఉంచుకోవడానికి ఇది బెస్ట్.

స్కూలెంట్స్‌ను పెంచడం చాలా సులభం, కనీస సంరక్షణతో ఇవి ఏడాది పొడవునా మీ ఇంటిని తాజాగా ఉంచుతాయి. మీరు కూడా మీ చిన్న అపార్ట్‌మెంట్‌ను ప్రకృతి ఒడిలా మార్చుకోవాలనుకుంటే, వీటిలో మీకు నచ్చిన మొక్కలను ఎంచుకోండి. అతి తక్కువ శ్రమతోనే మీ ఇల్లు ఒక స్టైలిష్ లుక్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ మొక్కలను తెచ్చుకుని మీ ఇంటీరియర్‌ని మరింత అందంగా మార్చుకోండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *