Headlines

నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!

నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!


సాధారణంగా తన సినిమాల విషయంలో ఖచ్చితమైన ప్రణాళిక, సమయపాలనతో ఉండే నేచురల్ స్టార్ నాని, పారడైజ్ చిత్రం విషయంలో మాత్రం తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. విడుదల తేదీలు మార్చి నుంచి ఆగస్టుకు, ఆగస్టు నుంచి డిసెంబర్‌కు వాయిదా పడుతుండడం నాని అభిమానులనే కాదు, సినీ పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఒకసారి విడుదల తేదీని ఖరారు చేస్తే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమయానికి వచ్చే నాని, పారడైజ్ విషయంలో పదేపదే వెనకడుగు వేయడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ అనూహ్య ఆలస్యం కేవలం పారడైజ్ కే పరిమితం కాకుండా, నాని తదుపరి ప్రాజెక్టులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. పారడైజ్ వాయిదా పడటం వల్లే ఆగస్టు 21న విడుదల కావాల్సిన ఈ సినిమా స్థానంలో ఇరుముడి విడుదలవుతోంది. ఇప్పటికే వంద రోజులకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి మరో 40 రోజులకు పైగా చిత్రీకరణ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. పారడైజ్ ఆలస్యం కారణంగా, నానితో చేయాల్సిన బ్లడీ రోమియో చిత్రాన్ని పక్కన పెట్టి, దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్‌తో OG 2 ను మొదలుపెడుతున్నారు. మొత్తానికి పారడైజ్ డైలమా ఎప్పటికి పరిష్కారమవుతుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం :

సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌

నెలలోపే ఓటీటీలో… బిగ్‌ స్క్రీన్‌కు భారీ గండి

గేమ్ ప్లాన్ మార్చిన టాప్ బ్యూటీస్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *