Headlines

ఒకే ఒక్క గ్లాస్‌తో బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యం.. డైలీ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యలన్నీ పరార్..

ఒకే ఒక్క గ్లాస్‌తో బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యం.. డైలీ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యలన్నీ పరార్..


ఏ సీజన్‌లోనైనా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. ఇంకా మలబద్ధకం తగ్గుతుంది.. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు – మలినాలు సులభంగా బయటకు పోతాయి. ఇది జీవక్రియను (Metabolism) ఉత్తేజపరిచి, బరువు తగ్గడానికి సహాయపడుతుందని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక, దగ్గు – జలుబు సమస్యలను తగ్గించి, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంటున్నారు..

గోరువెచ్చని నీటి ప్రయోజనాలు:

మెరుగైన జీర్ణక్రియ: గోరువెచ్చని నీరు ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగడమే కాకుండా, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

శరీర శుద్ధి (డిటాక్సిఫికేషన్): గోరువెచ్చని నీళ్లు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగి చెమట పడుతుంది. ఈ చెమట ద్వారా శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్ళిపోతాయి.

మెరుగైన రక్తప్రసరణ: గోరువెచ్చని నీళ్లు రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్తప్రసరణను పెంచుతాయి, ఇది మొత్తం శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

గొంతు సమస్యల నుండి ఉపశమనం: వేసవిలో ఇన్ఫెక్షన్‌ల ప్రమాదం ఉన్నప్పుడు లేదా గొంతులో అసౌకర్యంగా ఉన్నా గోరువెచ్చని నీళ్లు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.

కడుపుబ్బరింపు తగ్గింపు: చన్నీళ్ల పానీయాల కంటే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కడుపుబ్బరింపు తగ్గి జీవక్రియ, జీర్ణక్రియ వేగవంతం అవుతాయి.

శరీర ఉష్ణోగ్రత సమతుల్యత: ఐస్ వాటర్ తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రతలలో ఉన్నట్టుండి మార్పులు వస్తాయి. కానీ గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఇలాంటి సమస్య ఉండదు, శరీరం త్వరగా హైడ్రేట్ అవుతుంది. కీళ్ల నొప్పులు, ఊబకాయం సమస్యలు ఉన్నవారు చల్లటి నీటికి దూరంగా ఉండటం మంచిది.

ఈ కాంబినేషన్లతో మరిన్ని ప్రయోజనాలు..

జీలకర్ర, ధనియాల నీళ్లు: ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు ధనియాలను రాత్రి నీళ్లలో నానబెట్టి, ఉదయం ఈ నీటిని గోరువెచ్చగా చేసి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

పుదీనా, నిమ్మరసం మిశ్రమం: కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా నిమ్మరసం గోరువెచ్చని నీళ్లకు కలుపుకొని తాగితే కడుపుబ్బరింపు తగ్గుతుంది.

సబ్జా గింజల పానీయం: ఒక గ్లాసు నీళ్లకు ఒక చెంచాడు సబ్జా గింజలను అరగంట పాటు నానబెట్టి, కొద్దిగా సైంధవ లవణం కలుపుకొని తాగితే శరీరం లోపల చల్లబడుతుంది.

అయితే.. మితంగా గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారం సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *