జీవించి ఉన్న వ్యక్తుల ఫొటోలు, ఉత్తరం దిశలో ఉండొచ్చా? వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో ప్రతి దిశలో ఫొటోలు ఉంటాయి. ముఖ్యంగా ఉత్తరం దిశ సంపదకు అధిపతి, కుబేరుడి, బుద్ధ భగవానుడి దిశగా పరిగణిస్తారు. అందువలన ఈ దిశలో సానుకూల శక్తి ఆకర్షిస్తుంది అంటారు. అందుకే బతికి ఉన్నవారి ఫొటోలను ఉత్తరం దిశలో మాత్రమే పెట్టాలి అని చెబుతున్నారు పండితులు.
అంతే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం, బతికి ఉన్నవారి ఫొటోలను ఎప్పుడూ కూడా ఉత్తరం దిశలో మాత్రమే పెట్టాలంట. ఇది ఇంటికే శుభ ఫలితాలను ఇస్తుంది. అంతే కాకుండా సానుకూల శక్తి పెరిగేలా చేస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఉన్న సంతోషకరమైన ఫొటోలను, మీ పిల్లలతో దిగిన ఫొటోలను ఉత్తర గోడకు ఉంచడం చాలా మంచిది.
అలాగే చనిపోయిన పూర్వీకుల ఫొటోలు ఉత్తరం దిశలో లేదా ఉత్తరం గోడవైపు కూడా పెడుతుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు. ఇది వాస్తు సమస్యలకు కారణం అవుతుంది. అందువలన పూర్వీకుల ఫొటోలను కేవలం దక్షిణ వైపు గోడకు మాత్రమే తగిలించాలంట. చనిపోయిన వారి ఫొటోలను ఉత్తరం వైపుకు పెట్టడం వలన ఇంటిలో అశాంతి, ఒత్తిడి పెరుగుతుందంట.
ఒక వేళ మీకు అదృష్టం కలిసి రావాలి అంటే, మీ ఇంటిలో జీవించి ఉన్న వ్యక్తుల ఫొటోలు ఉత్తరం దిశలో, మరణించిన వారి ఫొటోలు దక్షిణ దిశలో పెట్టడం చాలా మంచిది. దీని వలన కుటుంబంలో సంతోషం నెలకుంటుంది. అంతే కాకుండా సంపద కూడా పెరుగుతుంది. నోట్ : పై సమాచారం కేవలం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




