Headlines

నా అసలు పేరు ఇది కాదు.. నాకు శాంతి స్వరూప్ అని పేరు పెట్టింది ఆమె..! షాకింగ్ విషయం చెప్పిన జబర్దస్త్ కమెడియన్


జబర్దస్త్ వేదికపై తన కామెడీ, ముఖ్యంగా లేడీ గెటప్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు శాంతి స్వరూప్. జబర్దస్త్ తో పాటు టీవీ షోలు కూడా చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు శాంతి స్వరూప్. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీరంగ ప్రవేశం, ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడించారు. నెల్లూరు జిల్లా బిట్రగుంటలో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ అసలు పేరు శాంతి కుమార్. ఐదవ తరగతి వరకు బిట్రగుంటలో, ఆపై కావలిలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. ఆయనకు శాంతి స్వరూప్ అనే పేరు యాంకర్ సుమ పెట్టిందని తెలిపాడు. కెవ్వు కేక అనే టీవీ షోలో సుమ ఆయన నవ్వును చూసి, నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు కదా, ఒక దూరదర్శన్ లో శాంతి స్వరూప్ అనేవారు ఉండేవారు, అలాగే నువ్వు కూడా శాంతి స్వరూప్ అని పిలిచిందట. సుమ ఇచ్చిన ఆ పేరు ఆయనకు నచ్చి, అప్పటి నుండి శాంతి స్వరూప్ గానే కొనసాగుతున్నారు.

ఇది కూడా చదవండి : ఏంటీ.. ఈవిడా ఆమె ఒక్కరేనా..!! ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ హాట్ బ్యూటీ ఈ అమ్మడు

శాంతి స్వరూప్ తన బాల్యం గురించి చెబుతూ.. వారిది ఐదుగురు అబ్బాయిల కుటుంబమని, తాను నాలుగవ వాడినని అన్నారు. 2007లో తండ్రి మరణించగా, తల్లి ఇంట్లో ఉంటూనే ఎన్నో కష్టాలు పడి తమను పెంచి పెద్ద చేసిందని గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తన తల్లి ఆడపిల్లలు లేరని ఒకసారి గౌను వేసిందని, అప్పుడే తనలో లేడీ గెటప్స్ బీజం పడిందేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. స్కూల్ ఏజ్‌లో ఒక జాతరలో స్టేజ్ షోలో చీర కట్టుకొని మొదటిసారి లేడీ గెటప్‌లో నటించానని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి : దొరికేసింది మావ..! అగ్నిపరీక్ష ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి బయట ఎలా ఉందో చూశారా..

పదవ తరగతి మధ్యలోనే చదువు మానేసిన శాంతి స్వరూప్, ఆర్టిస్ట్ అవ్వాలనే బలమైన కోరికతో కావలిలో ఎస్టీడీ బూత్‌లో పనిచేశారు. 2001లో కుటుంబ సభ్యులకు సీరియల్ అవకాశం వచ్చిందని అబద్ధం చెప్పి, కేవలం రూ. 200 తీసుకుని హైదరాబాద్‌కు వచ్చారు. కొండాపూర్‌లో బంధువుల ఇంట్లో కొంతకాలం ఉన్నప్పటికీ, సినీరంగంలో అవకాశాలు అంత సులభం కాదని గ్రహించారు. సినిమా రంగంలో ఉండాలనే తపనతో వైజయంతి సినిమా ఆఫీసులో ఆఫీస్ బాయ్‌గా చేరారు. జీతం లేకపోయినా, ఒకపూట భోజనం పెడితే చాలని అడిగి ఆ పనిని పొందారు. అక్కడ ఒక నెల పనిచేశాక, ఆర్టిస్టులకు అసిస్టెంట్‌గా మారారు. ఫైట్ మాస్టర్ విక్కీ, నటి రాశి, విలన్ సత్యప్రకాష్, దర్శకుడు పూరి జగన్నాథ్ వంటి పలువురి వద్ద సహాయకుడిగా పనిచేశారు. ముఖ్యంగా రాశి గారి కుటుంబంతో ఎక్కువ కాలం ఉన్నానని, వారు తనకు ఎంతో అండగా నిలిచారని శాంతి స్వరూప్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి : ఈ స్టార్ కమెడియన్ గుర్తున్నాడా.? ఆయన కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *