Headlines

బస్సులో పేలిన యాసిడ్ క్యాన్.. కళ్ల మంటలతో ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే!?


ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న యాసిడ్ క్యాన్ ఒక్కసారిగా పగిలిపోవడంతో పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కళ్ళ మంటలతో తీవ్రంగా బాధపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కడప జిల్లా కమలాపురం మండలం టీ చదివిరాళ్ల గ్రామం సమీపంలో అటుగా వెళుతున్న బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినబడింది. అందులో తీసుకువెళుతున్న యాసిడ్ క్యాన్ ఒక్కసారిగా పగలడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ప్రయాణికుల్లో ఒకరు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో బస్సును వెంటనే పక్కకు ఆపారు. వెంటనే ప్రయాణికులందరూ కిందకు దిగిపోయారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అనంతపురంకు చెందిన ఒక కార్గో కంపెనీ యాసిడ్‌ను కడప డిపోకు తరలిస్తున్న సమయంలో బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.

కమలాపురం నుంచి టీ చదివిరాల మండలం మీద గుండా వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సులో యాసిడ్ క్యాన్ పగలడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడం.. యాసిడ్ స్ప్రెడ్ అవ్వటం వల్ల ప్రయాణికులదరికీ కళ్ళు మంటలు రావడం జరిగాయంట. అయితే వెంటనే బస్సు పక్కకు ఆపడం వారు వెంటనే దిగిపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదే యాసిడ్ బాగా పేలి మనుషుల మీద పడి ఉంటే అందులోని వారికి పెద్ద ప్రమాదమే జరిగేది. వెంటనే బస్సు పక్కనే ఆపడం వలన ఏ విధమైన ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఏది ఏమైనా ఇలాంటి పదార్థాలు బస్సులలో తరలించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు వీటికి సపరేట్‌గా వేరే వాహనాలలో తరలించాలి తప్ప ఇలా ప్రయాణికులు ప్రయాణించే బస్సులలో తరలిస్తే జరగరానిది జరిగితే ఎవరు సమాధానం చెప్పాలి.

వీడియో చూడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *