Headlines

మిల్లెట్ ఆర్ట్‌తో చిరుధాన్యాల చరిత్ర.. 16 ఫ్రేముల్లో అద్భుతంగా ఆవిష్కరణ!


మోకా విజయ్ కుమార్ చిరుధాన్యాల తో చిత్రాల వేయడంలో సిద్ధమస్తుడు. ఇందులో భాగంగానే చిరుధాన్యాల ఆవశ్యకత చాటి చెప్పేందుకు ఇప్పటివరకు వందలాది చిత్రాలు వేశారు. రాగులు, కొర్రలు, అరికెలు, సామలు, నల్ల సామలు చిరుధాన్యాలతో వాటికి ఉన్న సహజ సిద్ధ రంగు తోనే చిత్రాలు వేయడం ప్రత్యేకత. ఇందులో భాగంగానే 16 ప్రేముల్లో.. చిరుధాన్యాల చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆదిమానవుల ఆహారపు అలవాట్లు, తొలి వ్యవసాయ పద్ధతులు, పంటల సాగు, ధాన్యాల నిల్వ, ప్రాచీన ఋషులు, రాజుల కాలంలో ఆహార సంస్కృతిని ప్రతిబింబించారు. అలాగే సాంప్రదాయ వైద్యంలో చిరు ధాన్యాల ప్రస్తావన, వలస పాలనలో ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, ఆధునిక ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం, వాటితో ముడిపడిన ఆరోగ్య సమస్యలు, వైద్యుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం వైపు మళ్లడం వంటి అంశాలను చిరుధాన్యాలతో చిత్ర రూపంలో ప్రదర్శించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *