Headlines

బాలింతలకు సాంబ్రాణి పొగ ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలివే!


సాధారణంగా ఇళ్లలో పూజా కార్యక్రమాలకు ఉపయోగించే సాంబ్రాణి పొగ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ జి.కె. తారా జయశ్రీ వెల్లడించారు. ముఖ్యంగా ప్రసవం తర్వాత బాలింతలకు సాంబ్రాణి పొగ వేయడం మన సాంప్రదాయంలో ఉంది. ఈ సువాసన భరితమైన పొగ అరోమాథెరపీలా పనిచేసి, మెదడులోని భావోద్వేగాలను నియంత్రించే లింబిక్ సిస్టమ్‌ను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల ప్రస్రవ అనంతర ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గింపు:

ప్రసవం తర్వాత మహిళలు అనేక రకాల శారీరక, మానసిక మార్పులను, ఒత్తిడిని ఎదుర్కొంటారు. సాంబ్రాణిని వెలిగించినప్పుడు వచ్చే సువాసన అరోమాథెరపీలా పనిచేస్తుంది. ఈ సువాసన మెదడులోని గ్రాహకాలను ఉత్తేజపరిచి, భావోద్వేగాలను నియంత్రించే లింబిక్ సిస్టమ్‌కు సంకేతాలను పంపుతుంది. ఇది శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయిలను తగ్గించి, మనసుకు అపారమైన ప్రశాంతతను చేకూరుస్తుంది.

ప్రసవానంతర నొప్పులు, వాపుల నివారణ:

సాంప్రదాయ పద్ధతి ప్రకారం ప్రసవం అయిన మహిళలకు సాంబ్రాణి పొగకు సమీపంలో కూర్చోబెడతారు. ఈ సున్నితమైన వేడి చికిత్స ద్వారా పెరినియల్ ప్రాంతానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. తద్వారా ఆక్సిజన్ మరియు పోషకాలు ఆ ప్రాంతానికి అంది, ప్రసవ నొప్పుల తర్వాత వచ్చే కండరాల బిగువు, నొప్పి, వాపు త్వరగా తగ్గుముఖం పడతాయి.

ఇవి కూడా చదవండి



హార్మోన్ల సమతుల్యత:

సాంబ్రాణి పొగలోని సువాసనలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్, ఆందోళనను తగ్గించడంలో సహాయపడి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.

జుట్టు సంరక్షణ, ఇతర లాభాలు:

గ్రామీణ ప్రాంతాలలో తలస్నానం చేసిన తర్వాత బాలింతలు, శిశువుల జుట్టు త్వరగా ఆరడానికి సాంబ్రాణి పొగను ఉపయోగిస్తారు. ఇది జుట్టు త్వరగా ఆడేలా చేయడమే కాకుండా చుట్టుపక్కల గాలిని శుద్ధి చేసి, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

పూర్వకాలం నుంచి మన పెద్దలు అనుసరిస్తున్న ఈ ఆచారంలో శాస్త్రీయత దాగి ఉంది. అయితే ఈ పొగను అతిగా పీల్చకుండా, తగిన మోతాదులో, సురక్షితమైన పద్ధతిలో ఉపయోగించడం బాలింతల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *