ఆధ్యాత్మిక నగరమైన కాశీ సరికొత్త పారిశ్రామిక, మహిళా సాధికారత కేంద్రంగా ఎదుగుతోంది. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రారంభమైన వస్త్ర పరిశ్రమల యూనిట్ ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల వారణాసిలోని అర్వింద్ మిల్స్ (ఆకృతి ఇనిషియేటివ్) యూనిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించి, అక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికులతో ప్రత్యేకంగా సంభాషించారు.
ఇంటి దగ్గరే ఉపాధి.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు
గతంలో ఇంటికే పరిమితమైన గ్రామీణ ప్రాంత మహిళలు ఇప్పుడు ఈ వస్త్ర పరిశ్రమ ద్వారా నెలకు నికర ఆదాయాన్ని పొందుతూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.శిక్షణ పొందుతూనే జీతం అందుకోవడం తమకు ఎంతో మేలు చేస్తుందని, ఉన్నత విద్య చదువుకోవడానికి ఈ సంపాదన ఉపకరిస్తుందని కార్మికులు ప్రధానికి తెలిపారు.కొందరు మహిళలు ఇక్కడ అనుభవం గడించి భవిష్యత్తులో సొంతంగా ఎంటర్ప్రైజ్ ప్రారంభించాలని లేదా ఫ్యాషన్ డిజైనర్లుగా, మేనేజర్లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కార్యాలయంలో భద్రత, సహోద్యోగుల ప్రోత్సాహం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయని వారు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
బనారస్ వస్త్రాలు ప్రపంచ స్థాయికి చేరాలి – ప్రధాని మోదీ
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మహిళలతో మాట్లాడుతూ.. బనారస్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖ్యాతిని గుర్తుచేశారు. బనారస్ చేనేత, వస్త్రాలు ఇప్పుడు భూటాన్, జపాన్ వంటి అనేక దేశాలకు ఎలా ఎగుమతి అవుతున్నాయో వివరిస్తూ, ఇక్కడి నుంచి తయారుయ్యే గార్మెంట్స్ కూడా ప్రపంచ విపణిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. వృత్తిలో సరికొత్త డిజైన్ల సృష్టి, నైపుణ్యం ఎంత ముఖ్యమో ప్రధాని వివరించారు. మహిళల ఎదుగుదల ద్వారా కుటుంబాలు, రాష్ట్రం, తద్వారా దేశం ముందుకు సాగుతుందని ప్రధాని వారిని ప్రోత్సహించారు.
From Varanasi to the world! https://t.co/llTOlnbU75
— Narendra Modi (@narendramodi) October 25, 2026