Headlines

Jabardasth Babu: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కథ అతడిదే.. తనే చేయాల్సింది.. డైరెక్టర్ జబర్దస్త్ బాబు..


జబర్దస్త్ బాబు.. ఇన్నాళ్లు బుల్లితెరపై కమెడియన్ గానే తెలుగు ప్రేక్షకులకు పరిచయం. కానీ ఇప్పుడు కేవలం మొదటి సిరీస్ ద్వారా దర్శకుడిగా సక్సెస్ అయ్యారు. ఇటీవల అతడు తెరకెక్కించిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ కు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల టీవీ9 స్పాట్‌లైట్ విత్ సతీష్ ప్రత్యేక పోడ్‌కాస్ట్‌లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ బాబు. ఈ సందర్భంగా ఆయన తన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కథ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించారు. ఈ కథ టేస్టీ తేజ నుండి వచ్చిందని బాబు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

టేస్టీ తేజ మొదట ఈ కథతో ఒక షార్ట్ ఫిలిం చేయాలని అనుకున్నాడని, అయితే ఆ ప్రయత్నం ఫలించలేదని బాబు వివరించారు. అప్పటికే ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన బాబు, తేజను ఒప్పించి కథను తీసుకున్నారు. అనంతరం ఈ కథను ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌కి తీసుకెళ్లారు. ఈ ప్రక్రియలో టేస్టీ తేజకు పూర్తి క్రెడిట్, ప్రత్యేక కృతజ్ఞతలు అందించినట్లు బాబు స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

తన కథ విజయం సాధించినందుకు టేస్టీ తేజ ఆనందంగా ఉన్నారని, తన స్నేహితుడు బాబు సక్సెస్ అయినందుకు సంతోష పడుతున్నారని బాబు పేర్కొన్నారు. తాను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయాననే చిన్న బాధ తేజకు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో అతనికి ఒక మంచి పాత్ర ఇవ్వాలనే కోరిక తన మనసులో ఉందని జబర్దస్త్ బాబు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

జబర్దస్త్ బాబు ఇంటర్వ్యూ..

Watch: ఇంత సడెన్ ఎంట్రీ ఇస్తే ఎట్లాగమ్మా.. కూతురిని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయిన తల్లి!



ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *