కూలర్‌ నుంచి ఎన్నడూ రాని సౌండ్స్.. ఏంటా అని పరీక్షగా చూడగా..

కూలర్‌ నుంచి ఎన్నడూ రాని సౌండ్స్.. ఏంటా అని పరీక్షగా చూడగా..


ప్రజంట్ పీక్ సమ్మర్ నడుస్తోంది.. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు క్రాస్ చేస్తున్నాయి. జనాలు అల్లాడిపోతున్నారు. ఏసీలను, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే వన్యప్రాణాలు సైతం తాపానికి జనావాసాల్లోకి వస్తున్నాయి. అందుకే ఇటీవల కాలంలో పాములకు సంబంధించిన వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి నివాస ప్రాంతాల్లోకి వచ్చి.. కాస్త నీడ ఉండే ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నాయి. వేసవిలో ఎయిర్ కూలర్ సర్వీసింగ్ చేస్తున్న సమయంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒక బుజ్జి వుల్ఫ్ స్నేక్ కూలర్ లోపల ఆశ్రయం పొంది ఉన్నట్లు గుర్తించారు. ఇది వుల్ఫ్ స్నేక్ జాతికి చెందినదని, దీనికి విషం ఉండదని నిర్ధారించారు. అయితే, దీని శరీరంపై ఉండే గీతలు, కట్లపామును పోలి ఉండటంతో సాధారణంగా ప్రజలు దీనిని విషపూరితమైనదిగా పొరబడతారు. అన్ని పాముల వలె ఇది కూడా నాలుకను బయటకి పెడుతుంది. ఎండాకాలం కావడంతో కూలర్‌ను బయట పెట్టి, బేడ్ షీట్ వేద్దామని చూస్తుండగా లోపల పాము ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే నిపుణుడికి ఫోన్ చేసి సమాచారం అందించగా, ఆయన వచ్చి పామును సురక్షితంగా పట్టుకున్నారు. ఈ సంఘటన వేసవిలో పాముల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. కాగా పాములు కనిపిస్తే ఆందోళన వద్దని తమకు లేదా ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు.

Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *