Watch Video: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన భవనం, ఒకరు మృతి, శిథిలాల కింద మరికొందరు!

Watch Video: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన భవనం, ఒకరు మృతి, శిథిలాల కింద మరికొందరు!


పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని కరైకాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనం అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చనే పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

స్థానికుల సమాచారం మేరకు, భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. అయితే కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు పలువురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భారీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగిస్తూ గాలింపు చేపడుతున్నారు. భవనం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, మృతుడి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే పూర్తి స్థాయిలో నష్టం వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కుప్పకూలుతున్న భవనం వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *