Money Lessons: మీ పిల్లలు భవిష్యత్తులో ధనవంతులు కావాలా? ఇప్పుడే పునాది వేయండి

Money Lessons: మీ పిల్లలు భవిష్యత్తులో ధనవంతులు కావాలా? ఇప్పుడే పునాది వేయండి


Money Lessons: మీ పిల్లలు భవిష్యత్తులో ధనవంతులు కావాలా? ఇప్పుడే పునాది వేయండి

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు, క్రమశిక్షణ, సంస్కారం వంటి విషయాలను ఎంతో శ్రద్ధగా నేర్పిస్తారు. అయితే డబ్బు నిర్వహణ, పొదుపు, ఖర్చు వంటి ఆర్థిక అంశాల విషయానికి వస్తే మాత్రం పిల్లలు పెద్దయ్యాక తెలుసుకుంటారని భావిస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు విలువ నేర్పించడం చాలా ముఖ్యం. ఒక రూపాయి కూడా విలువైనదేనని, అనవసర ఖర్చులు చేయకుండా పొదుపు చేయాలని నేర్పితే వారు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. చిన్న వయసు నుంచే ఆర్థిక విద్య అందించడం పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరిగ్గా వినియోగించడం కూడా అంతే ముఖ్యమని అర్థం చేసుకుంటారు.

చిన్న వయసు నుంచే ఆర్థిక పాఠాలు

పిల్లలకు డబ్బు విలువ, వస్తువుల ధరలు, భవిష్యత్ అవసరాల కోసం పొదుపు అవసరం వంటి విషయాలను చిన్నప్పటి నుంచే నేర్పించాలి. నాణేలు, నోట్ల విలువలను గుర్తించడం, చిన్న మొత్తాలను లెక్కించడం వంటి సాధారణ విషయాలతో ఈ ఆర్థిక పాఠాలను ప్రారంభించవచ్చు. ఇలా చేయడం వల్ల డబ్బు విలువ ఏంటో చిన్న పిల్లలకు తెలుస్తుంది.

పిల్లలను భాగస్వాములు చేయాలి

ఇంట్లో కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు లేదా ఇతర పేమెంట్స్ చేసే సమయంలో పిల్లలను కూడా భాగస్వాములను చేయాలి. షాపింగ్ సమయంలో వస్తువుల ధరలను పోల్చి కొనడం, ఏవిపడితే అవి కొనుగోలు చేయకుండా అవసరమైన వాటికే ప్రాధాన్యం ఇవ్వడం వంటి విషయాలు వారికి ప్రాక్టికల్‌గా నేర్పించాలి. వీలైతే పిల్లల పేరిట బ్యాంక్ ఖాతా తెరిచి, పొదుపు అలవాటు చేయడం కూడా మంచిది.

పెద్దలు ఆదర్శంగా నిలవాలి

అలాగే తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడం, అనవసర ఖర్చులను తగ్గించడం, భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం వంటి మంచి ఆర్థిక అలవాట్లను పిల్లల ముందు ఆచరించడం ద్వారా వారు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు.

నేటి ప్రపంచంలో చదవుతో పాటు ఆర్థిక అవగాహన కూడా చాలా అవసరంగా మారింది. చిన్నతనం నుంచే డబ్బు విలువను, బాధ్యతాయుతంగా ఖర్చులు చేసే అలవాట్లను నేర్పించడం ద్వారా పిల్లలు భవిష్యత్తులో ఆర్థికంగా స్వతంత్రంగా, బాధ్యతాయుతంగా ఎదగగలుగుతారు. ఇదే ఆర్థికంగా వారు ధనవంతులు కావడానికి బలమైన పునాది వారి చిన్నతనంలోనే వేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *