Divija Prabhakar: కొడుకొచ్చేశాడు.. ఇప్పుడు కూతురు.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాకర్ గారాల పట్టి

Divija  Prabhakar: కొడుకొచ్చేశాడు.. ఇప్పుడు కూతురు.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాకర్ గారాల పట్టి


Divija  Prabhakar: కొడుకొచ్చేశాడు.. ఇప్పుడు కూతురు.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాకర్ గారాల పట్టి

టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రభాకర్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్‌లో అద్భతమైన పాత్రలు పోషించి బుల్లితెర మెగాస్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నారాయన. కేవలం సీరియల్సే కాదు ఆపరేషన్ దుర్యోధన, మైసమ్మ ఐపీఎస్ వంటి సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్ చేశారు ప్రభాకర్. అయితే ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ కు దూరంగా ఉంటున్నారు ప్రభాకర్. కానీ ఆయన సినీ వారసత్వాన్ని కొనసాగించేందుకు కుమారుడు, కుమార్తె రెడీ అయ్యారు. ఇప్పటికే కొడుకు చంద్రహాస్ హీరోగా సినిమాలు చేస్తున్నారు. రామ్ నగర్ బన్నీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యాటిట్యూడ్ స్టార్ కొన్ని రోజుల క్రితం బరాబర్ ప్రేమిస్తా అంటూ మరోసారి ఆడియెన్స్ ను పలకరించాడు. సినిమా బాగానే ఆడినా తన ప్రవర్తనతో మరోసారి వివాదంలో చిక్కకున్నాడీ స్టార్ కిడ్. అయితే ఇప్పుడు
ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇప్పటికే దివిజ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చంద్రహాస్ నటించిన రామ్ నగర్ బన్నీ సినిమా నిర్మాతగా వ్యవహరించింది. అలాగే బ్రహ్మనందం ప్రధాన పాత్రలో తెరకెక్కిన బ్రహ్మా ఆనందం అనే సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనుంది దివిజ.

దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న సినిమా పేరు ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. సతీష్ ఆవాల తెరకెక్కిస్తోన్న ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో దినేష్ కుమార్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై నెలాఖరున విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం ప్రమోషన్లు కూడా మొదలు పెట్టింది. ఈ సినిమాలో సీనియర్ నటులు మురళీధర్ గౌడ్, సుధ, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతు ముంజెటి, హాసిని, యామిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తండ్రి ప్రభాకర్ తో దివిజ..

 

View this post on Instagram

 

A post shared by Divija Prabhakar (@divija_prabhakar)

కాగా దివిజకు సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Divija Prabhakar (@divija_prabhakar)

 

View this post on Instagram

 

A post shared by Divija Prabhakar (@divija_prabhakar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *