Headlines

నిరుద్యోగులకు శుభవార్త.. మరో DSCకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! అక్టోబర్‌లోనే నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త.. మరో DSCకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! అక్టోబర్‌లోనే నోటిఫికేషన్


అమరావతి, జూన్‌ 23: ఉద్యోగ క్యాలెండర్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో మరో మెగా డీఎస్సీ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మెగా డీఎస్సీ-2026 నోటిఫికేషన్‌ను అక్టోబర్ నెలలో విడుదల చేసి, నియామక పరీక్షలను డిసెంబర్ 2026లో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన డీఎస్సీ-2025 నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల విషయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని, ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం నియామకాలను కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

డీఎస్సీ-2025 నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా నిర్వహించినట్లు కోన శశిధర్ తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పలు ఆరోపణలను ఆయన ఖండించారు. ముఖ్యంగా సమాంతర రిజర్వేషన్లు, క్రీడాకోటా నియామకాలు, దివ్యాంగులకు రిజర్వేషన్ల అమలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా అన్ని నియామక ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు అమలు చేశామని తెలిపారు. రానున్న మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలోని ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మెగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్తగా భావిస్తున్నారు. అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల కానుండటంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే పరీక్షలకు సిద్ధమవ్వాలని విద్యాశాఖ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *