Headlines

Gold Price Trend: పెరగడా? తగ్గడమా? ఈ వారం పసిడి ధరలను నిర్ణయించే కీలక అంశాలు ఇవే!

Gold Price Trend: పెరగడా? తగ్గడమా? ఈ వారం పసిడి ధరలను నిర్ణయించే కీలక అంశాలు ఇవే!


పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో దిగొచ్చిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పుంజుకున్నాయి. అయితే వచ్చే వారం కూడా ఇదే తరహాలో రేట్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వచ్చే వారంలో ఇన్వెస్టర్లు అమెరికా సర్వీస్ PMI, వాణిజ్య గణాంకాలు, వారపు నిరుద్యోగిత భృతి క్లెయిమ్‌లపై దృష్టి పెట్టనున్నారు. అలాగే యూరో జోన్, చైనా, జపాన్, జర్మనీ దేశాల ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా బంగారం, వెండి ధరల నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. దానికి తోడు ప్రపంచ పరిణామాలలో ఎలాంటి పెద్ద మార్పులు చోటుచేసుకున్నా లేదా ముడి చమురు ధరలల్లో మార్పులు వచ్చినా బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి జోరు

జేఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి మంచి మద్దతు లభిస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఆగస్టు డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర వారంలో రూ. 3,216 వరకు పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాములకు బంగారం ధర రూ.1.47 లక్షలకు చేరింది. అలాగే వెండి ధర రూ. 13,938 పెరిగి, కిలోగ్రాముకు రూ. 2.37 లక్షలకు చేరింది.

డాలర్, వడ్డీ రేట్ల ప్రభావం

ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది ప్రకారం.. అమెరికన్ డాలర్ బలహీనపడటం, తక్కువ ధరల వద్ద కొనుగోళ్లు పెరగడం బంగారానికి కలిసివచ్చాయని తెలిపారు. సుమారు నెల రోజుల తర్వాత మార్కెట్ మళ్లీ పుంజుకుంటోందని.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడం, ముడి చమురు ధరలు స్థిరంగా ఉండటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు ఇన్వెస్టర్ల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేశాయని ఆయన తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్ మద్దతు

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. కామెక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ వారంలో 2.2 శాతం పెరిగి ఔన్స్‌కు 4,187.30 డాలర్లకు చేరగా వెండి 5.3 శాతం పెరిగి ఔన్స్‌కు 62.81 డాలర్ల వద్ద స్థిరపడింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న డిమాండే ఈ పెరగుదలకు కారణం అయింది. అలాగే మే నెలలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకుల్లో బంగారం నిల్వలు పెరగడం కూడా దీనికి కారణం

వచ్చే వారం ట్రెండ్ ఎలా ఉండొచ్చు?

ఈ మధ్య కాలంలో తగ్గిన బంగారం ధరలకు దిగువ స్థాయిల్లో మంచి సపోర్టు లభించిందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, వచ్చే వారం అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్, కీలక ఆర్థిక గణాంకాల ఆధారంగా మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. అందువల్ల, పెట్టుబడిదారులు ప్రపంచ పరిణామాలు, ఆర్థిక సంకేతాలపై నిఘా ఉంచాలని సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *