Headlines

పదో తరగతి మార్కులతో నేరుగా రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం.. 6,777 పోస్టులకు నోటిఫికేషన్‌

పదో తరగతి మార్కులతో నేరుగా రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం.. 6,777 పోస్టులకు నోటిఫికేషన్‌


నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్‌) పరిధిలోని డివిజన్‌, వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ గువాహటిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,777 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, కార్పెంటర్‌, ప్లంబర్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, సీఓపీఏ, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, మెకానిక్‌ డిజిల్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ టెక్నీషియన్‌ తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జులై 20, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

డివిజన్‌/ వర్క్‌షాప్‌ వారీగా ఖాళీల వివరాలు ఇవే..

  • కతిహార్ & తింధారియాలో పోస్టుల సంఖ్య: 1103
  • అలీపుర్‌దువార్‌లో పోస్టుల సంఖ్య: 651
  • రంగియాలో పోస్టుల సంఖ్య: 750
  • లుమ్‌డింగ్‌లో పోస్టుల సంఖ్యఫ 1274
  • టిన్‌సుకియాలో పోస్టుల సంఖ్య: 860
  • న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ & ఇంజినీరింగ్ వర్క్‌షాప్‌లో పోస్టుల సంఖ్య 881
  • దిబ్రూగర్‌లో పోస్టుల సంఖ్య: 763
  • ఎన్‌ఎఫ్‌ఆర్‌ హెడ్‌ క్వార్టర్‌/ మాలిగావ్‌లో పోస్టుల సంఖ్య: 495

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి.మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌ పోస్టులకు 12వ తరగతిలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోలజీ సబ్జెక్టులు చదివి, ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్ 19, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు మొదటి ఏడాది రూ.9,600, రెండో ఏడాది రూ.10,560, మూడో ఏడాది రూ.11,040 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి



నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *