అందం అభినయం ఉన్న అదృష్టం కలిసి రాక చాలా మంది హీరోయిన్స్ కనిపించకుండా మాయం అవుతున్నారు. అలాంటి హీరోయిన్స్ టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. కొందరు ఊహించని విదంగా సినిమాలకు దూరం అవుతుంటే మరికొందరు చేతులారా కెరీర్ ను నాశనం చేసుకున్నారు. స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్న చాలా మంది ముద్దుగుమ్మ రెండు మూడు సినిమాలకే ఇంటికెళ్లిపోవడం మనం చూస్తూనే ఉన్నాం.. ఆ తర్వాత చాలా కాలం కనిపించకుండా సడన్ గా ఎదో సినిమా ఫంక్షన్ లోనో లేక సోషల్ మీడియాలోనో దర్శనమిస్తూ ఉంటారు. అప్పటికి ఇప్పటికి గుర్తుపట్టలేనంతగా మారిపోతారు ఆ భామలు. అలా వచ్చి మాయం అయినా వారిలో ఈ అమ్మడు ఒకరు. అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఈ చిన్నది. తన అందంతో క్యూట్ నెస్ లో టీనేజ్ కుర్రాళ్లను కవ్వించింది. మనకు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అని అనుకోని కుర్రాడు లేడు. కానీ అంతలోనే అభిమానులకు ఊహించని షాక్ తగిలింది.
ఇదికూడా చదవండి : అమ్మబాబోయ్.. ఇదెక్కడి మార్పు రా మావ..!! ఈ చిన్నది ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్
చిన్న వయసులోనే కెరీర్ లో పీక్ చూసింది. కానీ ఓ హోటల్ లో పోలీసులకు చిక్కి అనుకోని వివాదల్లో చిక్కుకుంది. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. 17 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో స్టార్ డమ్ తెచ్చుకుంది. కానీ 23 ఏళ్లకే ఆమె కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఆ అందాల నటి మరెవరో కాదు శ్వేతా బసు ప్రసాద్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ అయ్యింది ఈ అమ్మడు. 2002లో బాలీవుడ్ చిత్రం మక్టీలో బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత కహానీ ఘర్ ఘర్ కీ అనే టీవీ సీరియల్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
ఇవి కూడా చదవండి
ఇదికూడా చదవండి :ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
ఆ తర్వాత తెలుగులో కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా ఈ మూవీలో తనదైన నటనతో అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించింది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే ఒకటి రెండు సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకునేలాగా వ్యభిచారం కేసులో చిక్కుకుంది. దాని నుంచి బయటకు వచ్చింది. తన తప్పులేకున్నా తనకు ఆ కేసులో ఇరికించారని తెలిపింది. ఆతర్వాత పెద్దగా సినిమా ఆఫర్స్ రాలేదు. దాంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. కానీ ఆ బంధం నిలబడలేదు. 2018లో ఓ వ్యక్తిని రహాస్యంగా పెళ్లి చేసుకుంది శ్వేత. కానీ వీరి బంధం 9 నెలలకే ముగిసింది. 23 వయసులోనే పెళ్లి.. ఆ తర్వాత విడాకులు తీసుకున్న శ్వేత.. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు హిందీలో సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ అయ్యింది.
ఇదికూడా చదవండి :ఎప్పుడూ లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు..! ఒక్కసారి ఈ పాట విను మావ.. ఒళ్లు పులకరించిపోతుంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి