రజినీకాంత్ జైలర్ 2 చుట్టూ జరుగుతున్న సెన్సార్ వివాదాలు, వాయిదా రూమర్లకు చెక్ పడిందా..? సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇచ్చినా సరే అంటున్నారా..? తగ్గేదేలే అంటూ యాక్షన్ డోస్ తగ్గించకుండా ఆ సర్టిఫికెట్‌తోనే అక్టోబర్ 15నే థియేటర్లలోకి రాబోతున్నారా..? అదే జరిగితే బాక్సాఫీస్ దగ్గర మాజీ అల్లుడు, రౌడీ బాయ్‌తో తలైవా ఫేస్ టు ఫేస్‌కు రెడీ అయినట్లేనా..? రజినీకాంత్ సినిమా వస్తుందంటే చాలు ఈ మధ్య సెన్సార్ వాళ్ళతో ఇష్యూస్ వస్తున్నాయి. జైలర్ 2 విషయంలోనూ అదే కంటిన్యూ అవుతున్నాయి. ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వైరల్ అవుతున్న వేళ అదేం లేదంటున్నారు మేకర్స్. వయొలెన్స్ చూసి సెన్సార్ బోర్డ్ A ఇవ్వడంతో యు/ఏ కోసం కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తారని టాక్ నడిచింది.. అది కూడా రూమర్‌గానే మిగిలిపోయింది. తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్, బ్యాలెన్స్ వర్క్ వల్ల అక్టోబర్ 15న జైలర్ 2 రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ.. అక్టోబర్ 15నే రిలీజ్ చేస్తున్నామని, సెన్సార్ కోసం యాక్షన్ డోస్ ట్రిమ్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా రజినీ చేసిన మ్యాజిక్‌ను ఈ సీక్వెల్ రిపీట్ చేస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు దర్శకుడు నెల్సన్.. జైలర్ 2కు ఈసారి బాక్సాఫీస్ బరిలో గట్టి కాంపిటీషన్ ఉంది. అక్టోబర్ 16న మాజీ అల్లుడు ధనుష్ నటిస్తున్న ఓం సినిమాతో పాటు విజయ్ దేవరకొండ రణబాలి కూడా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మరి ఈ క్రేజీ క్లాష్‌లో యంగ్ హీరోలను దాటి బాక్సాఫీస్‌ను సూపర్ స్టార్ ఏ రేంజ్‌లో షేక్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అన్నట్లు రజినీ గత సినిమా కూలీకి A సర్టిఫికెట్ ఇచ్చినపుడు కూడా మేకర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎల్పీజీ గ్యాస్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు కొత్త రూల్స్
UPI కొత్త నిబంధనలు ఇవే.. అక్టోబర్ 15 నుంచి అమలు
AIకి చెక్ పెట్టకపోతే ముప్పు తప్పదన్న నిపుణులు.. ట్రాష్ అంటూ కొట్టిపారేసిన ట్రంప్
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!