Headlines

Ajith Kumar: ఒక్క సెల్ఫీ అడిగినందుకు ఇలా చేస్తారా? హీరో అజిత్‌పై నెటిజన్ల ఆగ్రహం.. వీడియో ఇదిగో


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సిల్వర్ స్క్రీన్ పై కనిపించి సుమారు ఏడాదికి పైనే అవుతోంది. ప్రస్తుతం ఎక్కువగా కార్ రేసింగులపైనే దృష్టి సారిస్తున్నారీ సీనియర్ హీరో. తాజాగా యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ కార్ రేసింగులో పాల్గొన్నారు అజిత్. తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ సైతం ఈ పోటీలకు హాజరై తిలకించారు. అలాగే హీరోయిన్ త్రిష కూడా ఈ పోటీల్లో సందడి చేసింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత విజయ్- అజిత్‌ కలిసి కనిపించడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇదే కార్ రేసింగ్ ఈవెంట్ లో ఓ అభిమాని పట్ల హీరో అజిత్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కూడా అజిత్ తీరును తప్పుపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రేసింగ్ పూర్తయ్యాక నడుచుకుంటూ వస్తోన్న అజిత్ తో కలిసి ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అది కూడా దూరం నుంచే.. అయితే దీనిని గమనించిన అజిత్ బాగా సీరియస్ అయ్యారు. అభిమాని వైపు కోపంగా చూస్తూ కనిపించారు. దీంతో సదరు అభిమాని కూడా అజిత్ నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

కాగా ఒక సెల్ఫీ కోరిన అభిమానిపై అజిత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అభిమానుల పట్ల అజిత్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని కొందరు విమర్శలు చేస్తున్నారు. మరికొందరేమో అజిత్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో అజిత్ తప్పేమి లేదంటున్నారు. అలాగే అభిమానుల విపరీత చర్యలు, పోకడలను అజిత్ ఎప్పటికీ ప్రోత్సహించరని గుర్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి



ఇక సినిమాల విషయానికి వస్తే.. అజిత్ ప్రస్తుతం డేర్ డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్ భార్య శాలినీ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. దీంతో పాటు మంగత్తా 2 (తెలుగులో గ్యాంబ్లర్) సినిమాలోనూ అజిత్ నటిస్తున్నారని టాక్. వీటితో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలోనూ అజిత్ నటిస్తున్నారని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమాల నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

వీడియోఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *