నేపాల్‌కు అండగా “కే” పాప్ స్టార్ లీ నో..రూ. 69 లక్షలు విరాళం
ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్ కు సాయం చేయడానికి చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా కొరియా గాయకుడు లీ నో తన మంచి మనసు చాటుకున్నారు. నేపాల్ వరద బాధితుల కోసం ఆయన దక్షిణ కొరియా కరెన్సీలో 100 మిలియన్ వన్‌లను విరాళంగా ఇచ్చారు. మన భారత కరెన్సీలో దాదాపు రూ.69 లక్షలు అవుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం చేయడానికి ఈ డబ్బును ‘వరల్డ్ విజన్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన పంపించారు….