TG ICET 2026 Registration: విద్యార్ధులకు అలర్ట్.. ఐసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు! ఎప్పటి వరకంటే?
హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (TG ICET) 2026 ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 23తో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే దీనిని మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించింది….