Headlines

Chicken Prices: వామ్మో.. చికెన్ తినాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు..

Chicken Prices: వామ్మో.. చికెన్ తినాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు..


నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. చికెన్‌తో పాటు కోడి గుడ్ల ధరలు కూడా మండిపోతున్నాయి. రెండు వారాల క్రితం కిలో చికెన్ రూ.250 వద్ద పలకగా.. ఇప్పుడు ఏకంగా రూ.340కి చేరుకుంది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇక చికెన్‌తో పాటు కోడి గుడ్ల ధరలు కూడా పెరిగాయి. ఒక్కో గుడ్డు ఇటీవల రూ.6 వరకు పలకగా.. ఇప్పుడు రూ.9కి చేరుకుంది. ధరలు పెరగడంతో సామాన్యులకు ఇంటి ఖర్చు పెరుగుతోంది. పెరిగిన ధరలతో అమ్మకాలు కూడా తగ్గాయని చికెన్ దుకాణాదారులు చెబుతున్నారు. కేజీ చికెన్ తీసుకునేవారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు రూ.330 నుంచి రూ.340 వరకు పలుకుతున్నాయి. అయితే ప్రాంతాన్ని బట్టి చికెన్ రేట్లలో మార్పులు ఉంటాయి. ఒక్కొ ప్రాంతంలో ఒక్కొలా ధరలు ఉంటాయి. సుమారుగా కిలో చికెన్ రూ.340 వరకు తెలుగు రాష్ట్రాల్లో పలుకుతోంది. గతంలో స్కిన్ లెస్ చికెన్ రూ.250గా ఉండేది. కానీ రెండు వారాల్లో రూ.100 మేర పెరిగింది. సామాన్యులకు ఇది భారంగా చెప్పవచ్చు. ధరలు పెరగడంతో వారానికి రెండుసార్లు చికెన్ తినేవారు ఒక్కసారికి మాత్రమే పరిమితమవుతున్నారు. ఇక గుడ్ల ధరలు కూడా ఆమాంతంపెరిగాయి. గతంలో ఒక్కో గుడ్డు రూ.6కే లబించగా.. ఇప్పుడు రిటైల్ షాపుల్లో రూ.9 వరకు ఉంది. సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే గుడ్ల ధరలు ఇప్పుడు పెరిగా షాకిచ్చాయి. దీంతో గుడ్లను కూడా తక్కువగా తీసుకుంటున్నారు.

పెరిగిన గుడ్ల ధరలు

ఆదివారం వచ్చిందంటే చాలు మాంసం ప్రియులకు నోట్లోకి ముక్క దిగాల్సిందే. రేపు ఆదివారం వస్తుండటంతో చికెన్ తినాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. వారానికి ఒకసారి ఖచ్చితంగా చికెన్ తినేవారు ధరలను తట్టుకోలేక నెలకు ఒక్కసారికి మాత్రమే సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే ధరలు పెరగడం వల్ల చికెన్ అమ్మకాలు 30 శాతం మేర తగ్గిపోతున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. కోళ్ల, గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడం వల్లనే చికెన్ ధరలు పెరుగుతున్నట్లు కోళ్ల ఫామ్స్ నిర్వహకులు చెబుతున్నారు. మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అయితే ధరలు ఇలాగే కొనసాగితే తాము నష్టపోయే పరిస్థితి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక చికెన్, కోడి గుడ్ల ధరలు పెరగడంతో హోటల్, మెస్ యాజమానులు కూడా ధరలను పెంచుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *