ఇప్పుడు కనీస పెన్షన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.7,500 పెంచే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, వైద్య ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడంతో రూ.వెయ్యి పెన్షన్ ఎందుకు సరిపోవడం లేదు. దీంతో పెన్షన్‌ను రూ.7,500కి పెంచడం వల్ల ఉద్యోగులకు బెనిఫిట్ జరుగుతుందని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ అధికారులను పలుమార్లు కలిసి ప్రతిపాదనలు కూడా సమర్పించాయి.