Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..


Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన మోనాలిసా సోషల్ మీడియాలో ఒక్కసారిగా సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. కొన్ని రోజుల్లోనే మోనాలిసా జీవితం ఊహించని మలుపులు తిరిగింది. హిందీలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఆమె కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, ఈ వివాహం మొదటి నుంచీ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. మోనాలిసా పెళ్లిపై ఆమె తల్లిదండ్రులు, బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెది లవ్ జిహాద్ అని కామెంట్స్ చేశారు. మరోవైపు మోనాలిసా పెళ్లి నాటికి ఆమె వయసు 16 సంవత్సరాలు అని తేలడంతో ఆమె భర్తపై పోక్సో కేసు నమోదైంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

ఈ క్రమంలోనే ఇప్పుడు మోనాలిసా కనిపించడం లేదనే వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా రాజస్థాన్‌లోని అజ్మేర్, పుష్కర్ పర్యటనకు వెళ్ళిన సమయంలో మోనాలిసా కనిపించకుండా పోయిందని ఫర్మాన్ వీడియోలో పేర్కొన్నాడు. “మోనాలిసా పారిపోయింది.. ఆమె కోసం అజ్మేర్ అంతా వెతికాను, ఇప్పుడు జోధ్‌పూర్ వెళ్తున్నాను” అంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అదృశ్యం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) జరిపిన విచారణలో మోనాలిసా మేజర్ కాదని, ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమేనని తేలింది. తప్పుడు ధృవపత్రాలతో ఆమెను పెళ్లి చేసుకున్నారన్న ఆరోపణలపై ఫర్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

మరోవైపు, మోనాలిసా తల్లిదండ్రులు ఫర్మాన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తన కుమార్తె అదృశ్యం వెనుక ఫర్మాన్ కుట్ర ఉందని, పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికే అతను ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడని వారు వాదిస్తున్నారు. గత 15-20 రోజుల నుంచి తమ కుమార్తెతో మాట్లాడించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *