తన కెరీర్‌లో చాలా మంది హీరోలతో, దర్శకులతో కలిసి పనిచేయడం వల్ల వారందరినీ ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తానని నయనతార అన్నారు. ఏ ఒక్కరితో పనిచేసినా అది కేవలం పనిలా అనిపించదని, తన సహనటులు, దర్శకులు, చిత్ర బృందం అంతా తన కుటుంబంలో ఒక భాగమని ఆమె పేర్కొన్నారు. రవితేజతో తన అనుబంధం కూడా అలాంటిదేనని, కుటుంబ బంధం వలె పటిష్టమైనదని నయనతార తెలిపారు. అలాగే న్టీఆర్‌తో కలిసి పనిచేసినప్పటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆయన అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్ , సెట్స్‌లో ఆయన చేసే అల్లరి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు