Headlines

OTT Movie: దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie: దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు


ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. దీవానా, రావు బహదూర్ వంటి తెలుగు సినిమాలతో పాటు గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్ వంటి డబ్బింగ్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అలాగే అబ్జెషన్ మై లార్డ్, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచేందుకు రెడీగా ఉన్నాయి. అయితే వీటి కంటే ముందే ఓ తెలుగు క్రైమ్ సిరీస్ బుధవారం (జులై 29) నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సుమారు పదేళ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన ఓ కుంభకోణం ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. మొత్తం ఆరు ఎపిసోడ్లతో ఈ సిరీస్ ఎంతో థ్రిల్లింగ్ గా సాగుతోంది. సిరీస్ కథ విషయానికి వస్తే.. కొన్నేళ్ల క్రితం ఇండియన్ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్‌ఫోన్ స్కామ్ ఆధారంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను తెరకెక్కించారు. అతి తక్కువ ధరకే (కేవలం రూ.251 లకే) అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ ఒక స్టార్టప్ కంపెనీ సృష్టించిన సంచలనం దేశవ్యాప్తంగా ఎలాంటి అలజడి రేపిందో అందరికీ తెలిసిందే. అంతే కాదు రాత్రికి రాత్రే కోట్లాది రూపాయిల బుకింగ్స్ సాధించి, మీడియా హెడ్‌లైన్స్‌లో నిలిచింది ఆ కార్పొరేట్ కంపెనీ. మరి ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్ ఫోన్ వెనక ఉన్న స్కామ్ ఏమంటి? ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని సొమ్ము చేసుకుని కార్పొరేట్ కంపెనీ ఎలాంటి అక్రమాలకు పాల్పడిందన్నది ఈ సిరీస్ కథ.

ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ తెలుగు వెబ్ సిరీస్ పేరు ‘ఆజాదీ 501’. వాస్తవ సంఘటనల ప్రేరణతో తెరకెక్కిన ఈ సిరీస్ లో సై సినిమా ఫేమ్ శశాంక్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి డి గీతా భాస్కర్, రాకీ కృష్ణ, రవి వర్మ, హర్షవర్దన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వంశీ రంగిశెట్టి ఈ క్రైమ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకునేవారికి ‘ఆజాదీ 501’ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి



ఆహా ఓటీటీలో ఆజాదీ 501

ఆజాదీ 501 వెబ్ సిరీస్ ట్రైలర్..

Watch: పాముతో పరిహాసమా? ప్రాణాల మీదికి తెచ్చిన నిర్లక్ష్యం.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో వైరల్!



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *