12ఏళ్ల క్రితం పోయిన బిట్‌కాయిన్ మళ్లీ చేతికి.. రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!
క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో చోటుచేసుకునే వింతలు, విశేషాలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన క్రిస్ అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన ఒక సినీ ఫాంటసీని తలపిస్తోంది. 12 ఏళ్ల క్రితం శాశ్వతంగా పోయాయనుకున్న బిట్‌కాయిన్లు అనూహ్యంగా అతని చేతికి చిక్కడంతో అతను రాత్రికి రాత్రే ఏకంగా రూ. 36 కోట్లు సంపాదించి కోటీశ్వరుడయ్యాడు. సంవత్సరం 2011లో క్రిప్టోకరెన్సీలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న రోజుల్లో తన స్నేహితుడి సలహాతో క్రిస్ UKకి చెందిన ఇంటర్‌సాంగో అనే…