Headlines

T20 World Cup: మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ విన్నర్‌గా ఆసీస్.. 7వసారి ట్రోఫీని ముద్దాడిన జట్టు

T20 World Cup: మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ విన్నర్‌గా ఆసీస్.. 7వసారి ట్రోఫీని ముద్దాడిన జట్టు


మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చిరకాల ప్రత్యర్థి అయిన ఇంగ్లాండ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి, రికార్డు స్థాయిలో 7వ సారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌ దిగిచిన ఇంగ్లాండ్‌కు స్టార్టింగ్‌లో ఊహించని షాక్ తగిలింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ కేవలం 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో క్రీజులో బలంగా నిల్చొన్న కెప్టెన్ నాట్ సీవర్-బ్రంట్ వికెట్ కోల్పోకుండా నిలకడగా ఉంటూ రన్స్ చేసింది. ఆమెకు తోడు, యంగ్ బ్యాటర్ ఫ్రేయా కెంప్‌ సైతం తనదైన శైలిలో షాట్స్ కొడుతూ రాణించడంతో స్కోర్‌ బోర్డు కాస్త ముందుకెళ్లింది. ఇద్దరి భాగస్వామ్యంలో 80 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగలిగింది.

ఇక 151 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఇంగ్లాండ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్‌గా వచ్చిన బెత్ మూనీ 64 పరుగులలతో చెలరేగి జట్టును విజయం అంచుకు తీసుకెళ్లగా.. ఆమెకు తోడుగా వచ్చిన ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 48 పరుగులతో సత్తా చాటింది. ఈమె వికెట్ తర్వాత వచ్చిన ఎల్లీస్ పెర్రీ, యాష్ గార్డనర్ 17 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను క్లోజ్ చేసి విజయకేతనం ఎగురవేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *