శుక్రవారం (జూన్ 19) విడుదలైన విజయ్ ఆంటోని సినిమా వంద దేవుళ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన శశినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు స్వాసిక విజయ్, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు శశి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
కాగా ఈ సినిమాలో హీరో విజయ్ ఆంటోని అయినప్పటికీ స్వాసిక విజయ్ పాత్ర హైలెట్ అని చెప్పవచ్చు. ఇద్దరు పిల్లల తల్లిగా, ఒంటరి మహిళగా ఆమె అభినయం ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టిస్తోంది. నిజం చెప్పాలంటే చాలా సీన్లలో ఆమె హీరో విజయ్ ఆంటోనినే డామినేట్ చేసింది.
తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్వాసిక విజయ్ గతంలో 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ తల్లిగా నటించే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసిందట. ఇప్పుడు వంద దేవుళ్లు సినిమాలో తన నటనతో ఏకంగా హీరోనే డామినేట్ చేసిందీ అందాల తార.
సూర్య, త్రిష హీరో, హీరోయిన్లుగా నటించిన కరుప్పు (వీరభద్రుడు) సినిమాలోనూ స్వాసిక నటించింది. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేసింది
కాగా ఓ టీవీషోలో తనతో కలిసి నటించిన ప్రేమ్ జాకబ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది స్వాసిక విజయ్. ప్రస్తుతం కెరీర్, ఫ్యామిలీ పరంగా లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తోందీ అందాల తార. వంద దేవుళ్లు సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.





