Leopard Hunting Sheep: ప్రకృతిలో మనుగడ కోసం సాగే పోరాటాలు ఎప్పుడూ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. తాజాగా కొండ ప్రాంతంలో స్నో లెపర్డ్, భారీ కొండ గొర్రెను వేటాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చిరుత దాడి తర్వాత అక్కడ చోటు చేసుకున్న సీన్ చూస్తే కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
కొండరాళ్ల మధ్య ప్రాణసంకట స్థితి..
ఎడారి కొండ ప్రాంతాల్లో తిరుగాడే మంచు చిరుతలు తమ వేట నైపుణ్యానికి ప్రసిద్ధి. నిస్సారమైన, నిటారుగా ఉండే కొండరాళ్ల మధ్య కూడా తమ వేటను ఎంతో చాకచాక్యంగా పూర్తిచేస్తాయి. ఈ క్రమంలో ఓ కొండ గెర్రను చూసిన ఈ చిరుతపులి ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా దాడికి సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రాణభయంతో ఆ గొర్రె ఎదురు తిరిగింది. ఈ క్రమంలో కొండపై నుంచి రెండు జంతువులు దొర్లుకుంటూ కిందకు జారాయి. రెండు జీవులూ కొండపై నుంచి దొర్లుకుంటూ కిందపడటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ తర్వాత సీన్ రివర్స్..!
సాధారణంగా చిరుతపులి పంజా విసిరితే ఎంతటి జంతువైనా లొంగిపోవాల్సిందే. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ కొండపై నుంచి కిందపడుతున్న క్రమంలో రెండు జంతువులకు తీవ్రంగా గాయలయ్యాయి. అయినా, ఏమాత్రం తగ్గని చిరుత కొండ గొర్రె పట్టును మాత్రం వదల్లేదు. చిరుతపులి దాని మెడను నోటితో గట్టిగా పట్టుకుంది. కిందపడుతున్న సమయంలో తీవ్రమైన గాయాలతో కొండగొర్రె చనిపోయింది. చిరుతపులికి కూడా గాయాలు గట్టిగానే తగిలాయి. పడిపోయిన చోట ఈ రెండు జంతువులను చూస్తే కచ్చితంగా అవాక్కు అవ్వాల్సిందే. చిరుత కూడా నడిచేందుకు నానా తంటాలు పడుతూ కొండగొర్రె చెంతకు చేరుకుంది. అయినా, దానిని తినేందుకు కూడా ఓపిక లేకపోవడం గమానార్హం. ఈ వేట తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతోంది. వన్యప్రాణుల మనుగడ పోరాటానికి ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి.
ఈ వీడియోకు జతచేసిన అరబిక్ వ్యాఖ్య మరింత ఆసక్తిని రేకెత్తించింది. “ఈ వేట మార్కెట్‌లో అమ్మకానికి వెళ్లిన కంటే ఎక్కువ ఖర్చు పెట్టించింది” అనే భావంతో చేసిన వ్యాఖ్య నెటిజన్లను నవ్విస్తోంది. వీడియో కింద వచ్చిన స్పందనల్లో కూడా హాస్యం కనిపిస్తోంది. కొంతమంది “ఇప్పుడైనా చిరుత పదవీ విరమణ గురించి ఆలోచిస్తుందేమో” అని వ్యాఖ్యానిస్తే, మరికొందరు “వేటకు వెళ్లి ఎముకలు విరగగొట్టుకుని వచ్చిందేమో” అంటూ సరదాగా స్పందించారు. మరికొందరు ప్రకృతి ఎప్పుడూ ఊహించని మలుపులు చూపిస్తుందని పేర్కొన్నారు.
మంచు చిరుత, కొండగొర్రె పోరాటం వీడియో మీకోసం..
صدق.. طلع عليه أكثر من بيع السوق 😅 pic.twitter.com/HqZnBCHMy3
— مشعل الغريِّبْ (@meshal_alg4) June 24, 2026
లక్షలాది మందిని ఆకర్షిస్తున్న వీడియో..
ఈ వీడియోను సౌదీ అరేబియాకు చెందిన సామాజిక మాధ్యమ వినియోగదారు మెషాల్ అల్ గఫ్ @meshal_alg4 ఖాతాతో ఎక్స్ లో షేర్ చేశారు. కొద్ది గంటల్లోనే దీనికి 67 వేలకుపైగా వీక్షణలు నమోదయ్యాయి. వేలాది మంది దీనిని పంచుకుంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వన్యప్రాణుల జీవితంలో ప్రతి వేట విజయవంతం కావడం అవసరం లేదని, కొన్నిసార్లు ఆహారంగా మారాల్సిన జంతువే ప్రాణాల కోసం తీవ్రంగా పోరాడుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..