Headlines

WhatsApp Web: వాట్సప్‌ వెబ్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌!


ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, తన వెబ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు కేవలం మొబైల్ యాప్ లేదా డెస్క్‌టాప్ యాప్‌లకు మాత్రమే పరిమితమైన వాయిస్, వీడియో కాలింగ్ సౌకర్యం.. ఇప్పుడు నేరుగా వాట్సప్ వెబ్ బ్రౌజర్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. సంవత్సరాలుగా వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఫీచర్‌ను వాట్సప్ సైలెంట్‌గా అందుబాటులోకి తెస్తోంది. ఇకపై కంప్యూటర్ లేదా లాప్‌టాప్ బ్రౌజర్‌లో పనులు చేసుకునే ఉద్యోగులు, విద్యార్థులు ప్రతీసారి కాల్ మాట్లాడటానికి మొబైల్ ఫోన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా వెబ్ వెర్షన్ నుంచే వన్-టు-వన్ వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడవచ్చు. వెబ్ వెర్షన్‌లో మాట్లాడే కాల్స్‌కు కూడా డీఫాల్ట్‌గా ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్’ భద్రత ఉంటుంది. దీనివల్ల వినియోగదారుల సంభాషణలు అత్యంత రహస్యంగా, సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం వ్యక్తిగత కాల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే వెబ్ వెర్షన్‌లో ఒకేసారి 32 మంది పాల్గొనేలా గ్రూప్ వీడియో కాల్స్, స్క్రీన్ షేరింగ్, కాల్ లింక్‌ల షేరింగ్, కాల్ షెడ్యూలింగ్ వంటి అధునాతన ఫీచర్లను కూడా పరిచయం చేసేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరు బీటా వినియోగదారులకు కనిపిస్తుండగా, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. రోజంతా బ్రౌజర్ వాడే వారికి ఈ కొత్త ఫీచర్ ఎంతగానో ఉపయోగపడటంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రుణ గ్రహీతలకు షాక్‌.. వడ్డీ రేట్లు పెంచేసిన SBI

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై వారికీ రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపు!

బిగ్ అలర్ట్.. ఇకపై విమాన ప్రయాణంలో అది తీసుకెళ్లటం కుదరదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *