రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులంతా ఒకే వేదికపై కలిస్తే ఆ సందడే వేరు. తాజాగా చెన్నై వేదికగా జరిగిన ఓ ఘనమైన వివాహ వేడుకలో చాలా అరుదైన దృశ్యమే ఆవిష్కృతమైంది. రెండు తెలుగు రాష్ట్రాల అగ్ర నేతలతో పాటు తమిళ సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ జార్జ్ రెడ్డి కుమారుడైన వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహ వేడుక చెన్నైలో వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ దిగ్గజాలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఒకే వేదికపై దిగ్గజాల సందడి
ఈ వివాహ వేడుకకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతితో కలిసి హాజరయ్యారు. తమిళనాడు సీఎం విజయ్.. త్రిషతో కలిసి వేడుకకు విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదేవిధంగా తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సతీమణితో కలిసి ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.
Ys Jagan, Ktr, Thalapathy Vijay Attend Marriage 1
నెట్టింట్లో వైరల్ అవుతున్న స్టార్ ఫ్రేమ్
పెళ్లి వేదికపై నూతన వధూవరులతో కలిసి వైఎస్ జగన్-భారతి, కేటీఆర్ దంపతులు, విజయ్ – త్రిష ఒకేసారి నిలబడి ఫొటో దిగారు. విభిన్న రాజకీయ సిద్ధాంతాలు, ఇతర రాష్ట్రాల సమీకరణలు వంటి ముఖ్య నేతలతో పాటు సినీ తారలు అత్యంత ఆత్మీయంగా ఒకే వేదికను పంచుకోవడం, సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ అరుదైన గ్రూప్ ఫొటో బయటకు రావడంతో నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రముఖుల కలయికతో ఈ వివాహ వేడుక ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.