సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారా? బయటపడండి ఇలా

సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారా? బయటపడండి ఇలా


సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారా? బయటపడండి ఇలా

సాంకేతిక ప్రపంచంలో సౌలభ్యాలు పెరిగినట్టే, సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతం అయ్యాక, మన చుట్టూ పాజిటివిటీ కంటే నెగెటివిటీనే ఎక్కువగా కనిపిస్తోంది. ఖాళీ సమయం దొరికితే చాలు, వేళ్లు వాటంతట అవే రీల్స్‌ను స్క్రోల్ చేస్తున్నాయా? కళ్లు స్క్రీన్‌కు అతుక్కుపోతున్నాయా? విలువైన సాహిత్యం, సంగీతం వంటివి పక్కనపెట్టి, అర్థం పర్థం లేని వీడియోలను చూస్తూ గంటల సమయం ఎలా గడిచిపోతుందో కూడా అర్థం కావడం లేదు. ఈ అలవాటు మన ఉత్సాహాన్నీ, మనశ్శాంతినీ ఎలా హరిస్తుందో ఎప్పుడైనా గమనించారా?

సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రతి అంశాన్నీ బుర్రలో వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు నచ్చని వ్యక్తిని ఎదురుపడితే ఎలా ఇగ్నోర్ చేస్తామో, నెట్టింట కూడా అదే సూత్రాన్ని పాటించాలి. అనవసరమైన గాసిప్స్, ట్రోలింగ్ మరియు సెలిబ్రిటీల విషయాల్లో అనవసరపు వాదనలకు దిగడం వల్ల మన శక్తి వృథా కావడమే తప్ప, ఒరిగేదేమీ లేదు.

ఇగ్నోర్ మంత్రాన్ని ఎలా పాటించాలి?

  • మీకు నచ్చని, మనసును పాడు చేసే నెగెటివ్ కంటెంట్ కనిపిస్తే వెంటనే మార్చేయండి. వాదనల్లోకి దిగడం వల్ల మీరు సమయాన్ని కోల్పోవడమే కాకుండా, అనవసరమైన కోపానికి లోనవుతారు.
  • సోషల్ మీడియాలో వచ్చే సమాచారం అంతా నిజం కాకపోవచ్చు. మీకు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే, వార్తాపత్రికలు లేదా పుస్తకాలను ఆశ్రయించండి. దీనివల్ల మీకు విషయాలపై సొంత అభిప్రాయం ఏర్పడుతుంది. ఇతరుల అభిప్రాయాలు మీపై పనిచేయవు.
  • మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే, మీ సమయాన్ని, మానసిక శక్తిని అర్థవంతమైన పనులకే ఖర్చు చేయండి.

సమాచారాన్ని తెలుసుకోవడం ముఖ్యం, కానీ ఏది తెలుసుకోవాలో, దేనిని విస్మరించాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీదే. మనశ్శాంతి, మెదడు ఆరోగ్యం బాగుండాలంటే, నెగెటివిటీని ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. మీ సోషల్ మీడియా ఫీడ్‌ను మీ నియంత్రణలోకి తెచ్చుకోండి. మీ పైన ఎవరి అభిప్రాయమూ ప్రభావం చూపకుండా, సొంత ఆలోచనలతో బ్రతకడం మొదలుపెట్టండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *