పూల్ మఖానా పాయసానికి కావలసిన పదార్థాలు: రెండు కప్పులు పూల్ మఖానా , ఒక లీటర్ పాలు, ఒక కప్పు బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , 10 జీడిపప్పు , 10 బాదంపప్పులు , 10 పిస్తా పప్పులు, 10 కిస్మిస్, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి – ½ టీ స్పూన్, ఇంకా కొద్దిగా కుంకుమపువ్వు , ఒక టేబుల్ స్పూన్ డ్రై కొబ్బరి తురుమును తీసుకోవాలి.
పూల్ మఖానా పాయసం తయారి విధానం: ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి దాని మీద ఒక కళాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి వేడయ్యాక పూల్ మఖానాను తీసుకుని వేసి మీడియం మంటపై 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. అయితే, ఈ మఖానాను కరకరలాడనివ్వాలి. ఇలా అయినా తర్వాత వీటిని కొద్దీ సేపు బాగా చల్లారనివ్వాలి.
పూల్ మఖానా పాయసం తయారి విధానం స్టెప్ -1 : ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దానిలో సగం మఖానాను మిక్సీ పట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసి వాటిని బాగా మరిగించాలి. ఆ తరవాత ఈ పాలు బాగా మరిగిన తర్వాత మీడియం మంట మీద ఉంచి 10 నిమిషాల పాటు వాటిని బాగా ఉడికించాలి.
పూల్ మఖానా పాయసం తయారి విధానం స్టెప్ -2 : ముందు వేయించిన మఖానా, ఆ తరవాత పొడి చేసిన మఖానాను కూడా తీసుకుని రెండింటినీ పాలలో కలపాలి. ఈ మఖానా పాలలో మెత్తబడే వరకు వీటిని ఇంకో 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు బెల్లం పొడి కానీ, ఇంకా చక్కెర కూడా వేసి దీనిని బాగా కలపాలి.
ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా కొద్దిగా కుంకుమపువ్వు కూడా వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. చిన్న పాన్లో మిగిలిన నెయ్యి కూడా వేసి ఇంకా జీడిపప్పు, నాలుగు బాదం, నాలుగు పిస్తా, కిస్మిస్ను కూడా వేయించి పాయసంలో కలపాలి. చివరగా డ్రై కొబ్బరి తురుమును చేసి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించి తినడమే.




