Headlines

ఆ స్టార్ హీరో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. చాలా సరదాగా ఉంటాడు: రవిబాబు


నటుడు, దర్శకుడు రవిబాబు ఓ ఇంటర్వ్యూలో ఓ స్టార్ హీరోతో తనకున్న అనుబంధాన్ని, అలాగే ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లపై తన నిశితమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు.  మహేష్ తో తన సంబంధం కేవలం సినిమాల ద్వారా ఏర్పడింది కాదని, తమ కుటుంబాలు మద్రాసులో పక్కపక్కనే ఉండేవని, చిన్నతనం నుంచే ఆయన నాకు తెలుసు రవిబాబు వెల్లడించారు. “మేమందరం మద్రాసు బ్యాచ్ కదా. మా ఇద్దరి ఇళ్లు పక్కపక్కన ఉండేవి. జస్ట్ డయాగ్నల్లీ ఆపోజిట్ ఉండేది మా ఇల్లు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మహేష్,” అని ఆయన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ, ఆయన “చాలా జువెల్ గా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు, వెరీ కూల్” అని అన్నారు రవిబాబు.

తన నటన కెరీర్ గురించి మాట్లాడుతూ, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలలో తన పాత్రల ఎంపికపై మాట్లాడారు. తనకు మంచి పాత్రలు రావడానికి దర్శకుల విజనే కారణమని రవిబాబు అన్నారు. “డైరెక్టర్ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే, డైరెక్టర్ ఫీల్ అయితేనే మనకి ఆ క్యారెక్టర్ వస్తుంది. క్యాస్టింగ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ కదా. క్యారెక్టర్ కి సరిపోయే వాడిని పెడితేనే కదా క్యారెక్టర్ పండుద్ది,” అని ఆయన వివరించారు. కృష్ణవంశీ వంటి దర్శకులు తనను ఆ పాత్రలకు అనుకోవడంతోనే అవి తనకు వచ్చాయని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ బలవంతంగా లేదా ఆబ్లిగేషన్ మీద సినిమాలను చేయనని, ఎందుకంటే అలాంటి పనులు తప్పటడుగులు అవుతాయని అన్నారు. సరైన కారణంతో మాత్రమే పనులు చేయాలని ఆయన బలంగా నమ్ముతారు.

తన నటన పాత్రలు ఇటీవల తగ్గడంపై మాట్లాడుతూ, రచయితల కొరతను ఎత్తి చూపారు. “ఇతను, ఇతను వేయాలి వేషం. కానీ ఇతనికి నేను రైటర్ గా నేను ఈ వేషాన్ని ఇలా చెక్కాలి. చెక్కి ఈ నువాన్సెస్, ఈ ఆర్క్ ఇదంతా ఇలా ఉండాలని చెప్పేసి ఎవరు రాస్తున్నారు? అలా ఎవరు రాయట్లేదు కదా ఇప్పుడు కథలు. రైటర్సే లేరు కదా ఇండస్ట్రీలో, తగ్గిపోయారు కదా,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దర్శకులే కథలు రాసుకుని, దర్శకత్వం వహించడం వల్ల కథల్లో లోపాలు ఏర్పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమలో పెరుగుతున్న “తక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తుల”  ప్రవేశాన్ని రవిబాబు తీవ్రంగా విమర్శించారు. దర్శకత్వానికి సరైన శిక్షణ, కథ చెప్పే నైపుణ్యం, కళ, విజ్ఞానం పట్ల అవగాహన ఉండాలని ఆయన అన్నారు. కేవలం కథ రాసుకుని వస్తే, అతనికి దర్శకత్వ అవకాశం ఇవ్వడం వల్ల “మాన్స్టర్” లను సృష్టించినట్లు అవుతుందని అన్నారు. కెమెరామ్యాన్, ఎడిటర్ వంటి సాంకేతిక నిపుణులపై ఆధారపడి సినిమాలు తీయడం వల్ల అసలైన దర్శకత్వం కొరవడుతుందని, ఇది మొత్తం ఒక “కిచిడీ గందరగోళం” లాగా ఉందని రవిబాబు విమర్శించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *