Tollywood : అతడికి 60 ఏళ్లు.. రెండుసార్లు విడాకులు.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో ప్రేమాయణం..

Tollywood : అతడికి 60 ఏళ్లు.. రెండుసార్లు విడాకులు.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో ప్రేమాయణం..


వివాహం అనేది వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ఏ వయసులోనైనా ఎవరైనా ప్రేమలో పడవచ్చు అనే మాట వింటుంటాం. నిజ జీవితంలో కాకపోయినా.. సినీ పరిశ్రమలోనే పలువురు సెలబ్రెటీల విషయంలో మాత్రం ఇది అక్షర సత్యమనే చెప్పుకోవాలి. కొన్నాళ్లుగా తారల వ్యక్తిగత జీవితాలు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఇలా ఏదోక న్యూస్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది. ఓవైపు విడాకులు ప్రకటిస్తారు..మరోవైపు పెళ్లి, ప్రేమ గురించి వెల్లడిస్తారు. ప్రస్తుతం ఓ స్టార్ హీరో పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. అతడి ప్రేమ గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు అడియన్స్. ఈ నేపథ్యంలో, 61 ఏళ్ల సూపర్‌స్టార్ నటుడు జూన్ 5న వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్. భారతీయ సినిమా చరిత్రలో ఒక అభేద్యమైన రికార్డును నెలకొల్పారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

హీరోయిజం సినిమాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు నటించిన దంగల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్లు వసూలు చేసి భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ఆ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఆమిర్ ఖాన్ చివరి చిత్రం ‘సిత్తారే జమీన్ పర్’ అభిమానుల నుండి మంచి ఆదరణ పొందింది. సినిమా రంగానికి అతీతంగా ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఆయన 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వారు 2002లో విడాకులు తీసుకున్నారు. ఆమిర్ ఖాన్ 2005లో చిత్ర దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. చాలా కాలం పాటు కలిసి జీవించిన ఈ జంట, 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఒక నటుడు.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

ఇదిలా ఉండగా, 61 ఏళ్ల బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కొంతకాలంగా గౌరీ అనే మహిళతో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఈవెంట్స్, పార్టీలలో కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమీర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను జూన్ 5న వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గౌరీ వయసు 47 ఏళ్లు. ఈ వివాహం చాలా నిరాడంబరంగా జరగనుందని చెబుతున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హాజరు కానున్నారని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

అమీర్ ఖాన్ ఫోటో..

Aamir Khan, Gauri Wedding

Aamir Khan, Gauri Wedding

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *