సంగీతానికి భాషతో సంబంధం లేదు, అది హృదయాలను కదిలిస్తుంది. ఈ మాట చాలా సార్లు వినే ఉంటారు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ , యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. పక్కా మాస్ వైబ్రేషన్స్, పల్లె పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన మెలోడీ సాంగ్ యూట్యూబ్ లో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ పాటను విన్న ప్రతి ఒక్కరూ దీని లూప్ మోడ్‌లో వింటూ, తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేస్తున్నారు. కేవలం పాట మాత్రమే కాకుండా, దీని విజువల్స్, కొరియోగ్రఫీ, నటీనటుల హావభావాలు ఈ సాంగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఫోక్ సింగర్ కనకన్న పాడిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసుకుందామా.
ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..
మనం మాట్లాడుకుంటున్న పాట పేరు “గెన్నె రామ గెన్నె రామ.. గెన్నె రామ గెట్టు మీద.. గున్న మామిడో పిలడ.. గున్న మామిడో పిలడ” అంటూ కనకవ్వ పాడిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఈ పాటను కనకవ్వ పాడగా.. ఎస్కే బాజీ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటలో తమదైన మాస్ స్టెప్పులతో అలరించారు టోనీ కిక్. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాతో పాటు అటు యూట్యూబ్ లో దూసుకుపోతుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..
“గిన్నె రామ గిన్నె రామ” అనేది కేవలం ఒక సరదా పాట మాత్రమే కాదు; ఇది తెలంగాణ పల్లె జీవితాన్ని, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ సాంగ్ అని చెప్పాలి. పూర్వం పల్లెల్లో పొలం పనులు చేసేటప్పుడు, అలసట తెలియకుండా ఉండటానికి మహిళలు సమూహాలుగా చేరి ఇలాంటి పాటలు పాడుకునేవారు. కనకవ్వ సేకరించిన ఈ పాత జానపద పాట ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం డీజేలోనూ మరోమోగుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..
కనకవ్వ ఫోక్ సాంగ్..
Watch : ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఫన్నీ రనౌట్.. మొహసిన్ ఖాన్ బ్లండర్.. తలపట్టుకున్న లక్నో కెప్టెన్
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..