Headlines

Rohit Sharma: రిటైర్ అవ్వమన్నారు కదరా.. సెంచరీతో బదులిచ్చాడు! రోహిత్ మాస్ బ్యాటింగ్

Rohit Sharma: రిటైర్ అవ్వమన్నారు కదరా.. సెంచరీతో బదులిచ్చాడు! రోహిత్ మాస్ బ్యాటింగ్


ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. 388 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని అందించిన హిట్‌మ్యాన్ చాలా కాలం తర్వాత తనదైన మార్క్ షాట్లతో అలరించాడు. 85 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రోహిత్ ఫ్యాన్స్ మాత్రం.. డబుల్ సెంచరీ కోరుకుంటున్నారు.

ఈ మ్యాచ్‌లో తన బ్రాండ్ పుల్ షాట్లతో అదరగొట్టిన రోహిత్.. భారీ సిక్స్‌‌లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గిల్ 84 బంతుల్లో 77 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అద్భుతమైన షాట్లతో ఇంగ్లాండ్ బౌలర్లను సునాయసంగా ఎదుర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంటూ పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. లార్డ్స్ వన్డే రోహిత్‌కు చివరి వన్డే అంటూ రిపోర్ట్స్ అంటూ చాలా హడావిడి జరిగింది. వన్డే వరల్డ్ కప్ 2027 కోసం బీసీసీఐ ప్లాన్స్‌లో రోహిత్ లేడంటూ, సెలెక్టర్లు చెప్పేశారంటూ నానా రచ్చ సాగింది. ఈ క్రమంలోనే రోహిత్ సెంచరీతో విరుచుకుపడ్డంలో అన్ని పుకార్లకు పుల్ స్టాప్ పడినట్లు అయింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *